హబుల్ అంతరిక్ష దూరదర్శిని



హబుల్ అంతరిక్ష దూరదర్శిని ( Hubble Space Telescope) భూ నిమ్న కక్ష్యలో తిరుగుతూ ఉన్న టెలిస్కోపు. 1990 లో  నాసా ఈ టెలిస్కోపును ప్రయోగించింది. అమెరికాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు  ఎడ్విన్ హబుల్ పేరున దీని నామకరణం జరిగింది. అంతరిక్షంలోకి పంపిన టెలిస్కోపుల్లో ఇది మొదటిదేమీ కానప్పటికీ, మిగతా వాటికంటే ఇది విస్తృతమైన కార్యకుశలత కలిగినది. దీని ముఖ్య ఉద్దేశం రోదశి లోతుల్లో ఉన్న నభోమూర్తుల అధ్యయనం. దీనిని డిస్కవరీ స్పేస్ షటిల్ ద్వారా ఏప్రిల్ 1990 లో భూ నిమ్న కక్ష్యలో ప్రవేశపెట్టారు.హబుల్ అంతరిక్ష దూరదర్శిని (Hubble Space Telescope (HST))

డిస్కవరీ అంతరిక్ష వాహనం నుండి కనబడుతున్న హబుల్ టెలీస్కోపు.
     డిస్కవరీ తీసిన 'హబుల్ టెలీస్కోపు' చిత్రం.

ప్రాథమిక దర్పణాన్ని సరైన ఆకారానికి పాలిష్ చెయ్యకపోవడంతో సరిగా ఛాయా చిత్రాలు ఇవ్వలేదు.సమస్యను సరిచేసేందుకు నాసా ఒక సర్వీసు యాత్రను తలపెట్టింది. హబుల్ ను రిపేరు చేసేందుకు, అందుకు అవసరమైన పరికరాలను ఉపయోగించడం లోను ఏడుగురు వ్యోమగాములకు లోతైన శిక్షణ నిచ్చింది. 1993 డిసెంబరులో ఎండీవర్ షటిల్ ద్వారా వారిని అంతరిక్షంలోకి పంపింది. వాళ్ళు 10 రోజుల పాటు అంతరిక్షంలో ఉండి హబుల్‌కు అవసరమైన అన్ని మరమ్మతులు పూర్తి చేసి తిరిగి వచ్చారు.

తరువాత విశ్వంలో ఆభరణంలాంటి ఆకృతి కలిగిన దేదీప్యమాన నెబ్యూలాను క్లిక్ మనిపించింది హబుల్.(26.12.2017)

సుదూర విశ్వంలో వర్ణరంజితమైన ఆభరణంలా ధగధగ లాడుతున్న ఒక గ్రహ నెబ్యూలాను అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు క్లిక్ మనిపించారు. హబుల్ స్పేస్ టెలిస్కోపు సాయంతో దీన్ని ఫొటో తీశారు. వెలుపలికి జారిపోతున్న వాయువు చరమాంకంలో ఉన్న ఒక తార వెలుగుల సాయంతో మెరిసిపోతున్న దృశ్యం ఇందులో ఉంది. ఒక తారకు వయసు మీదపడే కొద్దీ దానికి సంబంధించిన 'భారీ అరుణ' దశ ముగింపు కొస్తుంది. అప్పుడు అది తన ఉపరితలం నుంచి పొరలుపొరలుగా వాయువును వెలువరిస్తుంది. చివరకు ఉష్ణ మయ శ్వేత మరుగుజ్జు తారగా అది మిగులుతుంది. ఇలాంటి నెల్యూ" లాను భూమికి 11వేల కాంతి సంవత్సరాల దూరంలో ఈనుగొన్నారు. దానికి ఎన్జీసీ 6326 అని పేరు పెట్టారు. ఇందులో నీలం, ఎరుపు వర్ణం.. అయనీకరణ చెందిన ఆక్సిజన్, హైడ్రోజన్ వంటి పదార్ధాలు నుంచి వెలువడుతోంది. హైడ్రోజన్, హీలియం వంటి భార మూలకా లను ఇలాంటి గ్రహ నెల్యూలాలే విశ్వమంతటా వ్యాప్తి చేస్తాయి.

       1995లో మైకేల్ మేయర్, డీడీర్ క్వెలోజ్లు తొలిసారి సౌరకుటుంబానికి ఆవల మన పాలపుంతలోనే ఇంకో గ్రహం ఉన్నట్లు గుర్తించారు ఫ్రాన్స్ లోని హాట్ ప్రావిన్స్ అబ్బర్వేటరీలో పరిశోధనలు చేసిన వీరు గుర్తించిన తొలి ఎక్సోప్లానెట్ పేరు పెగాసీ 512. ఇది మన గురు గ్రహాన్ని పోలి ఉంటుంది. అప్పటివరకూ సౌర కుటుంబానికి ఆవల గ్రహాలుండవన్న అంచనాతో ఉన్న భౌతిక శాస్త్రవేత్తలు ఆ తరువాత బోలెడన్ని పెద్ద గ్రహాలను గుర్తించారు. నాసా ప్రయోగించిన హబుల్ కెప్టర్ టెలిస్కోపులు పంపిన సమాచారం ఆధారంగా చూస్తే ఇప్పటివ రకూ సుమారు 4000 ఎక్సో ప్లానెట్లను గుర్తించినట్లు తెలుస్తుంది ఇదంతా ఆకాశంలో ఒక దిక్కున చిన్న ప్రాంతానికి సంబంధించినదే. ఆకాశం మొత్తాన్ని జల్లెడ పడితే వేల, లక్షల సంఖ్యలో ఎక్సోప్లానెట్లు గుర్తించవచ్చనేది అంచనా. గ్రహాల రూపురేఖలు, నిర్మాణాలపై శాస్త్రవే త్తలకు ఉన్న అవగాహన మొత్తాన్ని వీరిద్దరూ మార్చేశారనడంలో ఏమాత్రం సందేహం లేదు. చుట్టూ ఉన్న గ్రహాల గురుత్వాకర్షణ ప్రభా వానికి గురయ్యే నక్షత్రాల కాంతిలో మార్పులొస్తుంటాయి. ఈ మార్పుల ఆధారంగానే మేయర్స్, డీడీర్ లు పెగాసీ 51బీని గుర్తించారు.


Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata