జీన్_డిఎన్ఏ_మ్యుటేషన్స్



      జీన్స్ గురించి 1951 లో జేమ్స్ వాట్సాన్, జేమ్స్ క్రూక్ సాయంతో డీ ఆక్సీరైటో న్యూక్లియక్ యాసిడ్(డి.ఎన్.ఏ) అనే జన్యువు (జీన్ ) గురించి పరిశోధించారు. వాళ్ళు కనుగొన్నదేమంటే డి.ఎన్.ఏ. ఒక న్యూక్లియక్ ఆమ్లమని, మన కణ కేంద్ర కాల్లోని మైటోకాండ్రియాలో ఉండే క్రోమోజోమ్ లో ఈ డీఎన్ఏ ఉండ చుట్టుకుని ఉంటుందని. 
        అతి సూక్ష్మ బ్యాక్టీరియా మొదలుకొని ఒకప్పటి రాక్షస బల్లుల వరకూ అన్ని జీవుల్లోని కణాల్లో ఉండే ప్రాథమి కమైన విషయం డీఆక్సీరైబో న్యూక్లిక్ యాసిడ్ క్లుప్తంగా డీఎన్ఏ.
      1953 లో వాట్సన్, క్రిక్ లు ఇద్దరు శాస్త్రజ్ఞులు డి.ఎస్. ఎ స్వరూపాన్ని ఆవిష్కరించారు.ఇది రెండు గొలుసులు పెనవేసుకున్నట్టుగా ఉంటుంది. ఈ గొలుసులు ఒక చక్కెర కణం, ఒక పాస్పేట్ కణం పక్కన పక్కన చేరడం వల్ల ఏర్పడుతాయి.రెండు గొలుసులు మధ్య నాలుగు రకాల అణువులు షట్కోణాకారంలో అమరివుంటాయి. ఈ నాలుగు రకాల అణువులు - అడినైన్, గ్వానైన్, థయమిన్, సైటోసైన్.మనం ఎంత పొడవు పెరగాలి? కళ్ల రంగు ఏంటి? వచ్చే జబ్బులేవి? వంటి అన్ని రకాల సమాచారం దీంట్లోనే ఉంటుంది.డి.ఎన్.ఏ. కు ఒక నిర్దిష్టమైన కాలపరిమితి ఉంది. డీఎన్ఏ మెలితిరిగిన నిచ్చెన ఆకారంలో ఉంటుంది.
కణ జీవితం డి.ఎన్.ఏ. మెలికల్లో ఉంటుంది. 
కణాలలోని ఇతర భాగాలు ఈ సమాచారాన్ని చదువ గలుగుతాయి. మూడు మెలికలు కలిసి ఒక అమినో యాసిడ్ తయారు చేయమని కణానికి సంకేతం ఇస్తాయి, ఈ అమినో ఆసిడ్ లే ప్రోటీన్లుగా మారతాయి. ఇవి మొత్తం 20. వీటిల్లో 9 అతి ముఖ్యమైనవి. ఇవి శరీరానికి
అత్యంత అవసర మైనవి. ప్రోటీన్లు కణాల నిర్మాణానికి ఇంటికి ఇటుకలెలా ఉంటాయో అలా పనిచేస్తాయి. ఆడినైన్ కేవలం థయమిన్ తో మాత్రమే జతకట్టి ఒక మెట్టులా ఉంటే.. సైటో సైన్ గ్వానైన్  తో మాత్రమే జతకడుతుంది. ఇలాంటి ఒక్కో మెట్టును న్యూక్లియోటైడ్ బేస్ పెయిర్ అంటారు. మానవ డీఎన్ఏలో దాదాపు 300 కోట్ల బేస్ పెయిర్స్ ఉంటాయని అంచనా.
       భూమ్మీద 780 కోట్ల మందికిపైగా మనుషులంటే.. ఇందులో ఏ ఒక్కరి డీఎన్ఏ కూడా ఇంకొకరి మాదిరిగా ఉండదు. అయితే డీఎన్ఏలోని 300 కోట్ల బేస్ పెయిర్స్ లో 99.7 శాతం అందరికీ సమానమే. మిగిలిన బేస్ పెయిర్స్ లో ఉండే తేడాలే ఒకొక్కరినీ స్పెషల్ చేస్తాయి. ఈ తేడాలు ఎక్కడు న్నాయో గుర్తించడం ద్వారా ఇద్దరి డీఎన్ఏను పోల్చవచ్చు. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పని చేసేది ఇలాగే. బిడ్డకు తండ్రికి మధ్య ఉండే పోలికలు 50 శాతం కంటే ఎక్కువగా ఉంటే.. 
తోబుట్టువుల మధ్య ఇది 25 శాతం నుంచి 75 శాతం వరకూ ఉంటుంది. ఒకే పిండం రెండుగా విడిపోయి పుట్టిన కవలల్లో మాత్రమే వంద శాతం పోలిక కనిపిస్తుంది.

        ప్రతి కణానికి మరో జీవిని సృష్టించగల సామర్థ్యం ఉంటుంది, దీనివల్లనే శాస్త్రవేత్తలు "క్లోనింగ్ జరపగలుగుతున్నారు. వీర్యం, అండకణాలు ఇందుకు మినహాయింపు. ఇవి అర్ధకణాలు. వీటిల్లో సగం మాత్రమే జన్యువులు ఉంటాయి. ఇవి రెండు కలిసి ఫలదీకరణం చెందినప్పుడే సంపూర్ణ కణంగా మారుతాయి. ఫలదీకరణ అండం విభజన ద్వారా తిరిగి కొత్త కణాలు వస్తాయి. ఒక జీవి జీవిత కాలమంతా ఈ ప్రక్రియ కొనసాగుతుంది తల్లిదండ్రులు జన్యువుల కలయికతో కొత్త జీవి పురుడు పోసుకుంటుంది. శిశువులో ఇద్దరి లక్షణాలు వారసత్వంగా వస్తాయి. అయితే ఇవి ఒక పునాది మాత్రమే. భవిష్యత్తులో అవి గణనీయంగా మారిపోతాయి

      ఒక జంతువు నుండి కణాలు సేకరించి అదే జంతువును సృష్టించడమే క్లోనింగ్, కానీ ఇందులో జీవవైవిధ్యం ఉండదు. ఇలాగే మనుషుల్ని కూడా తయారు చేయవచ్చు. కానీ ఇది ప్రకృతి నియమాలకే విరుద్ధం. స్త్రీ, పురుష సంగమం ప్రకృతి సహజంగా ఏర్పడింది. కానీ మానవుల్లో ఆది సంస్కృతి పరమైందిగా మారిపోయింది. ఆకుపచ్చ ఆల్గేతో ప్రారంభమైన జీవం పరిణామ క్రమంలో అనేక మార్పులకు లోనై మనిషి గా మార్పు చెంది తన్ను తాను కనుక్కునే స్థాయి చేరింది.

         అవిచ్చిన్నంగా సాగే వారసత్వ లక్షణాలు ఒక్కోసారి పూర్తిగా మారిపోతాయి. ఎందువల్ల ? దానికి కారణం ఉత్పరివర్తనం(మ్యూటేషన్స్) అని కనుగొన్నారు. శాస్త్రవేత్తలు క్రోమోజోములలో ఒక రకమైన మ్యుటేష, జీన్స్ లో మరోరకమైన మ్యుటేషన్ జరుగుతుంది.

       క్రోమోజోముల్లో జరిగే అనూహ్యమైన మార్పే మ్యుటేషన్. ఒక్కోసారి క్రోమోజోములు తమ స్థానాన్ని మార్చుకోవచ్చు. అప్పుడు మ్యుటేషన్ జరగవచ్చు. ఒక్కోసారి క్రోమోజోముల సంఖ్య మారుతుంది. ఇవి చీలినప్పుడు కణ విభజన జరగదు. మళ్ళీ చేరుతాయి. అప్పుడు కూడా కణ విభజన జరగకపోవచ్చు. మళ్ళీ దగ్గర కు చేరతాయి. ఆ సమయంలో కణ విభజన జరగొచ్చు. దాంతో క్రోమోజోముల సంఖ్య కొత్త కణాలతో రెట్టింపు సంఖ్యలో ఉంటాయి. అలా మ్యుటేషన్ జరగొచ్చు, ఇలా జరిగినప్పుడు సంతానంలో కొత్త లక్షణాలు వస్తాయి

      ‌ జీన్లలో మ్యుటేషన్లు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు, ఒక్కోసారి జీన్స్ తమనుతాము ఉత్పత్తి చేసుకోవడంలో ఏదో పొరపాటున జరిగి పాత జీన్ లక్షణాలు కాకుండా కొత్త లక్షణాలు ఏర్పడతాయి. ఇలా మ్యుటేషన్ అయిన జీన్స్ యదాతథంగా తమ లక్షణాలను కొనసాగిస్తూ కొత్త లక్షణాలను వారసత్వంగా ఇస్తూవుంటాయి, ఎప్పుడు ఏ జీన్ ఏవిధంగా మ్యుటేషన్ అవుతుందో చెప్పడం సాధ్యం కాదు. ప్రయోజనకరమైన మ్యుటేషన్ జరిగితే జీవి ఎక్కువ కాలం వాటిని కొనసాగిస్తుంది. హానికరమైన మ్యుటేషన్ జరిగితే జీవి, దాని సంతతి కొంత కాలానికే అంతరించిపోతాయి.






 




Comments

Popular posts from this blog

Darwin theory

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం