భూమి ఎలా ఏర్పడింది



భూమి ఎలా ఏర్పడింది?... 
        విశ్వంలో ఉండేదంతా పదార్ధమే.మన  భూమి, గ్రహాలు, సూర్యుడు, నక్షత్రాలు, గాలాక్సీలు అన్నీ పదార్ధమే.ఈ పదార్థ పరిణామంలో భాగంగానే భూమి పుట్టింది.
     సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఒక ఆదిమ పదార్థం మహా విస్ఫోటం (big bang) చెందటం తో ఈ విశాల విశ్వం (universe) ఏర్పడింది.ఆ ప్రేలుడు దెబ్బ కు అది వేగంగా విస్తరించడం మొదలుపెట్టింది.ఆ క్రమంలో ధూళికణాలు లతో కూడిన  వాయు మేఘాలు ఒకేచోట దట్టంగా పేరుకున్నాయి. వాటిని గేలక్సీ లన్నారు. ఆ గేలేక్సీలే  నక్షత్ర రాశులు. అవి తాము తిరుగుతూ వేగంగా ఇప్పటికీ ఎక్కడికో కదలుతూనే ఉన్నాయి. ఆ గేలెక్సీలో ఒక గుంపు నక్షత్రాలను పాలపుంత ( నెబ్యులా) అన్నారు.అలాంటివి చాలా ఉన్నాయి. మన మున్న పాలపుంత లో మన సూర్యుడు ఒక నక్షత్రం. విస్పోటనం అంటే ప్రేలుడు జరిగిన ప్పుడు వెదజల్లబడిన  వాయు మేఘాలు చిందరవందరగా తిరుగుతూ తిరుగుతూ సూర్యుని గా మారిన ఒక
అతి పెద్ద వాయుమేఘం చుట్టూ ధూళి కణాల మధ్య నున్న ఆకర్షణ కారణంగా పరిభ్రమణం అంటే తిరగుతూ ఉండేవి. ఈ వాయు మేఘాల్లో 
హైడ్రోజన్, హీలియంలాంటి తేలికైన వాయువులు,
అతి సూక్ష్మ రేణువులు ఉండేవి.
          ఇవి ఒక చక్రంలాగా తిరగటంవలన మేఘం ఘనీభవించి, ధూళిరేణువుల మధ్య దూరం తగ్గింది. ఒక పెద్ద రేణువు చుట్టూవున్న చిన్న రేణువులను తనలో కలుపుకొని  మరింత పెద్దదయింది. అక్కడక్కడ దూళి రేణువుల సమూహం ఏర్పడి సూర్యుడిచుట్టూ తిరగసాగాయి.సూర్యుడుగా మారిన పెద్ద వాయు మేఘం తన గురుత్వాకర్షణతో ఆ ధూళి రేణువుల సమూహాలను ఆకర్షించడం మొదలుపెట్టింది. కాని సమూహాలలో కొన్ని తమలోని రేణువుల పరస్పరాకర్షణ బలంతో సూర్యుని ఆకర్షణ బలాన్ని నిరోధించగలిగాయి. అంటే వికర్షించగలిగాయి.  ధూళిరేణువుల మధ్య ఆకర్షణ పెరిగి వాటిమధ్య దూరం క్రమంగా తగ్గింది. ఇది సుదీర్ఘకాలంలో అంటే కోటాను కోట్ల పరిణామంలో వందల వేల కి.మీ. వ్యాసం గల గోళాలుగా రూపొందాయి. సుమారు 600 కోట్ల సంవత్సరాల క్రితం సౌరమండలం (solar disc) రూపు దిద్దుకుంది.

మొదట్లో చిన్న పెద్ద గోళాలు చాలా ఏర్పడినాయి. కాని అవి ఒక కొకటి ఢీకొని ముక్కలై పోకుండా, సూర్యుడి ఆకర్షణను గురై ఆవిరై పోకుండా, ఇప్పుడు కొన్ని పెద్ద రాజకీయ పార్టీలు చిన్న చిన్న రాజకీయ పార్టీలను తమలో విలీనం చేసుకున్నట్లు,
కొన్ని పెద్దగోళాలు గురుత్వాకర్షణ శక్తితో తమ చుట్టూ వున్న పదార్థాన్ని, చిన్నచిన్న గోళాలను జేర్చుకొని మరింతగా పెద్దవిగా పెరిగాయి.  కాల క్రమంలో   సూర్యుని చుట్టూ ఇవే గ్రహాలుగా మారాయి.  మన భూమి కూడా ఈ గ్రహాలలో ఒకటి. ఇంచుమించు సూర్యుడు ఏర్పడుతున్న సమయంలోనే మన భూమి కూడా ఏర్పడిందన్న మాట.

వాయ ధూళి మేఘాల నుండి గ్రహాలు పుట్టాయనడానికి ఆటోష్మిట్ అనే సోవియట్ గ్రహాల పుట్టుకు సంబంధించిన ఒక శాస్త్రీయసిద్ధాంతాన్ని  రూపకల్పన చేశాడు.
గ్రహాలన్ని తమ చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఈ తిరిగే మార్గాలన్నీ గుండ్రంగా ఒకే దిక్కుగా వున్నాయి. గ్రహాల మధ్య దూరం, వాటి వేగం, భౌతిక లక్షణాలు ఒక నిర్దిష్ట పద్ధతిలో వున్నాయి. కనుక భూమి ఇతర గ్రహాలు దేనికవే పుట్టినవిగావని, ఒకే పదార్థంనుండి ఒకేకాలంలో, ఒక క్రమంలో పుట్టాయని చెప్పవచ్చని ఆయన ప్రతిపాదించారు.

  యురేనియం, థోరియంమొదలైనవి వాటిలో రేడియో ధార్మిక గుణం ఉంటుంది.   వీటిలోని పరమాణువులు విచ్ఛిన్నమై సీసంగా మారతాయి. యురేనియం ముక్క తీసుకొని దానిలో  సీసం ఎంత ఉన్నది తెలుసుకంటే దాని వయస్సు చెప్పొచ్చు. ఈ విధంగా యురేనియం తో ఉన్న మన భూమి వయస్సు కనుక్కున్నారు.

ఆధునిక విశ్వ సిద్ధాంతాల (cosmology) ప్రకారం ఆ  పదార్థం క్రోడీకరించుకుంది.  ప్రతి నక్షత్రం మొదట్లో ఓ వాయు అగ్ని పళ్లెంలాగా ఏర్పడింది. అలాంటిదే  రూపుదిద్దుకుంది. అది తన చుట్టూ తాను తిరిగే క్రమంలో అపలంబ బలం(centrifugal force) వల్ల అంచుల్లో ఉన్న ద్రవ్యం గ్రహాలుగా, మధ్యలో భాగం సూర్యుడిగా మారాయి. కాబట్టి భూమి కూడా ఆ సౌరమండల పళ్లెంలో ఒక భాగమే. అంటే భూమి, సూర్యుడు కూడా సోదరులు మాత్రమే. భూమి వయస్సు సుమారు 450 కోట్ల సంవత్సరాలు. ఇది కూడా మొదట్లో సూర్యుడిలాగే స్వయం ప్రకాశకం(self luminiscent). కానీ కేంద్రక సంలీన(nuclear fussion)కు కావలసిన ఉదజని (హైడ్రోజన్‌) తొందరగా ఖర్చు కావడం వల్ల అగ్ని ఆగిపోయి చల్లబడి క్రమేపీ ప్రస్తుత స్థితికి చేరుకుంది.కానీ మృతి గ్రంథాలలో భూమి పుట్టి  ఇప్పటికీ  కొన్ని వేల సంవత్సరాలే అవుతోందని చెప్పినాయి.బైబిల్ మరియు ఖురాన్ లోని  కథలలో   భూమి క్రీ.పూ. 4004 లో పుట్టిందని చెప్పినారు. పరిశోధకులు ఇంతకుముందు చెప్పినట్టు  భూమి పుట్టి  450  కోట్ల సంవత్సరాలవుతోంది.

         
     విశ్వంలో ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి. మన పాలపుంత కూడా అందులో ఒకటి.ఆ  పాలపుంతలోనే భూమి,సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి.

సౌర వ్యవస్థ నూరు కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. విశ్వంలోని భూమి, ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ ఉండే దుమ్ము, ఇతర వాయువుల సమూహం (సౌర నిహారిక) నుంచి ఆవిర్భవించాయి. ఈ దుమ్ము, వాయువుల సమూహం నుంచి భూమి ఏర్పడటానికి 10-20 మిలియన్‌ సంవత్సరాలు పట్టినట్లు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

భూమి మీద దాదాపు 71 శాతం ఉపరితలం ఉప్పు నీటితో ఆవరించి ఉండగా, మిగిలిన భూభాగంలో ఖండాలు, ద్వీపాలున్నాయి

భూమి ఏర్పడిన తొలి దశలో భూమి అత్యధిక ఉష్ణోగ్రతతో అగ్నిగోళంగా ఉండేది. భూమి అంతర్భాగం నుంచి వివిధ వాయువులు, నీటి ఆవిరి లావా రూపంలో బయటకు ఎగిసిపడేవి. బయటకు వచ్చిన నీటి ఆవిరి మేఘాలుగా మారి, ఆ మేఘాలు భూమి నుంచి ఎత్తుకు వెళ్లాయి. వాతావరణంలో వచ్చే మార్పుల మూలంగా మేఘాలు చల్లబడి వర్షించాయి. అలా వర్ష రూపంలో భూమిపైకి చేరిన నీరే సముద్రాలుగా ఏర్పడ్డాయి.
తొలిదశలో భూమి మొత్తం ఒకే ఖండంగా ఉండేది. కాలాల్లో వచ్చే మార్పుల వల్ల భూమి పై భాగం ఫలకాలుగా విడిపోయింది. భూమి లోపలి ఉష్ణోగ్రతల వల్ల ఈ ఫలకాలు ఒకదాని నుంచి మరొకటి దూరంగా పోయాయి. అవే ఖండాలుగా ఏర్పడ్డాయి. మధ్యలో అగాధాలు ఏర్పడగా అవే మహ సముద్రాలుగా ఏర్పడ్డాయని ఇప్పటికి వరకు జరిగిన పరిశోధనల ఆధారంగా చెప్పవచ్చు. అయితే అమెరికాలోని వర్జీనియా టెక్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ పరిశోధకులు ఖండాలు ఏర్పడిన తీరుపై ఇటీవల పరిశోధన చేసి 250 కోట్ల ఏళ్ల క్రితం జీవజాలన్ని, వాతావరణాన్ని మార్చేసిన కారణాలను విశ్లేషించడంతో పాటు, ఖండాలు ఏర్పడిన తీరును కనుగొన్నారు.
250 కోట్ల ఏళ్ళ క్రితమే ప్రాచీన యుగంలో ఖండాలు ఏర్పడ్డాయని, ఆ సమయంలో భూమిపై ఇప్పుడున్న ఉష్ణోగ్రత కంటే మూడు రెట్లు అధికమైన ఉష్ణోగ్రత ఉండేదని, అగ్నిపర్వతాల విస్ఫోటనం అధికమనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. కాబట్టి ఆ సమయంలో జీవజాలం మనుగడ అనేది బహుశా పరిమితంగా ఉండి ఉంటుందని అంచనా వేశారు. భూమి పొరల్లో మాత్రమే తేలికైన సిలికాన్‌ రాళ్లు ఉన్నాయని, ఇది భూ గ్రహానికి ఉన్న ప్రత్యేక లక్షణమని శాస్త్రవేత్తలు తెలిపారు. అగ్నిపర్వతాల బద్దలైనపుడు భూమి పొరలలోని ఖాళీల గుండా బయటకు తన్నుకు వచ్చిన లావా క్రమంగా చల్లబడుతుంది. అలా చల్లబడిన అనేక ప్రాంతాలే మానవులు నివాసముంటున్న నేటి ద్వీపాలని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.
1. భూమి కి ఎల్లలునాయని, అని మతం చెబుతుంది. కాని సైన్స్  భూమి ఎల్లలతో  బల్లపరుపు గా కాకుండా  గుండ్రంగా  ఉందని  నిరూపించింది.భూమి గుండ్రంగా ఉందన్న విషయం చంద్రగ్రహణ సమయంలో చంద్రుడి మీద పడిన భూగోళపు నీడని బట్టి రుజువు చేయబడింది.

3.

6. భూమి  అప్పుడే  నోవా కాలం లో  ప్రళయం వచ్చి  మునిగి పోయిందని  మతం చెబుతుంది.( మన మృత్యుపురాణం  లో  కూడా  ఇలాంటి   కథ  వుంది). అన్ని  కాలాల  శిలాజాలాను  పరిశీలిస్తున్నా   సైన్స్ కి  అంత  పెద్ద  ప్రళయానికి    సంబంధించినా ఒక్క శిలాజం (fosil) కూడా  ఇప్పటికీ    దొరకలేదు.

8. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడని , భూమి  తర్వాతే సూర్యుడు పుట్టాడని మతం చెబుతుంది. ( as per genisis and kuran ) . కాని సైన్స్  ఇది  తప్పని స్పష్టం గా చూపింది.

9.భూమి పైన సప్త ఆకాశాలు ఉన్నాయని(Quran 23:17) , భూమి కింద కూడా ఏడు లోకాలున్నాయని (హిందూ పురాణాలూ) మతాలు చెప్పుతున్నాయి. కాని  ఆకాశమంటూ  ప్రత్యేకంగా ఏది  లేదని సైన్స్  చెబుతుంది. 

10..భూమికి స్తంబాలున్నాయని మతం చెప్పింది.  సైన్స్  భూమి విశ్వం లో గురుత్వాకర్షణ శక్తితో  నిలుచుంది అని చెబుతుంది.

 ఇంకా  భూమి నిలకడగా ఉంటుందని,  భూమి  ఒకప్పుడు సముద్రం లో తేలియాడేదని , ఇంకా. ఇలా ఎన్నో   కల్పనలను , కథలను  అన్ని మతాలు చెబుతున్నాయి. 

ఇక భూమి పుట్టి లక్షల సంవత్సరాలయింది. యుగాలు ఒక దాని తరువాత మరొకటి వచ్చాయి. సుమారు 6000 సంవత్సరములు భూమి వయస్సుంటుందని స్పష్టముగా బైబిలు భోధిస్తున్నది, కలిపిన లేక తీసివేసిన కొన్ని వందల సంవత్సరములు మాత్రమే తేడా ఉంటుంది.

నెబులా అనగా వాయువుల సమూహాలు ఏర్పడ్డాయనీ, వాటిలో అగ్ని తీవ్రత ఉండేదనీ అది క్రమక్రమంగా ద్రవంగానూ, ఘనపదార్థంగానూ మారి నక్షత్రాలు, గ్రహాలుగా ఏర్పడ్డాయని చదువుతాం. 8 అది తన చుట్టూ తాను తిరిగే క్రమంలో అపలంబ బలం(centrifugal force) వల్ల అంచుల్లో ఉన్న ద్రవ్యం గ్రహాలుగా, మధ్యలో భాగం సూర్యుడిగా మారాయి. కాబట్టి భూమి కూడా ఆ సౌరమండల పళ్లెంలో ఒక భాగమే. అంటే భూమి, సూర్యుడు కూడా సోదరులు మాత్రమేనని చెబుతారు.

వారి అభిప్రాయం ప్రకారం భూమి వయస్సు సుమారు 550 కోట్ల సంవత్సరాలు. ఇది కూడా మొదట్లో సూర్యుడిలాగే స్వయం ప్రకాశకం(self luminescent). కానీ కేంద్రక సంలీన(nuclear fusion)కు కావలసిన ఉదజని (హైడ్రోజన్‌) తొందరగా ఖర్చు కావడం వల్ల అగ్ని ఆగిపోయి చల్లబడి క్రమేపీ ప్రస్తుత స్థితికి చేరుకుంది.

విశ్వంలోని భూమి మరియు ఇతర గ్రహాలు సౌర నీహారిక (సూర్యుడు ఆవిర్భవించినప్పుడు వలయాకారంలో ఏర్పడిన ధూళి మరియు ఇతర వాయువుల సమూహము) నుండి ఆవిర్భవించినవి. ఈ ధూళి యొక్క సమూహము నుండి భూమి అవతరించడానికి 10-20 మిలియన్ సంవత్సరాలు పట్టిందని చెబుతారు. 14 భూమి యొక్క బాహ్య పొర మొదట్లో వేడికి కరిగి ఉండేది. తరువాత అది చల్లబడిన తరువాత గట్టిపడి భూమి మీద వాతావరణంలో నీరు కూడుకున్నది. దీని తర్వాత చంద్రుడు ఆవిర్భవించాడని వాదిస్తారు.

భూమి ఏర్పడిన తొలి 100 కోట్ల సంవత్సరాల్లోపే సముద్రాల్లో జీవం ఉద్భవించింది. ఈ జీవం భూ వాతావరణాన్ని, భూ ఉపరితలాన్నీ ప్రభావితం చేసింది. దాంతో ఏరోబిక్, ఎనరోబిక్ జీవాలు తామరతంపరగా వృద్ధి చెందాయి. కొన్ని భూభౌతిక ఆధారాల ప్రకారం, 410 కోట్ల సంవత్సరాల కిందటే భూమిపై జీవం ఉద్భవించింది. అప్పటి నుండి, సూర్యుని నుండి భూమి ఉన్న దూరం, భూమి భౌతిక లక్షణాలు వగైరాలు జీవులు వృద్ధి చెందటానికి కారణమయ్యాయి.  భూమి చరిత్రలో, జీవ వైవిధ్యం దీర్ఘ కాలాల పాటు వృద్ధి చెందింది. కొన్ని సార్లు జీవులు సామూహికంగా అంతరించి పోయాయి. ఇప్పటి వరకూ భూమిపై జీవించిన జీవజాతుల్లో 99% వరకూ అంతరించి పోయాయి. ప్రస్తుతం ఉన్న జీవజాతుల సంఖ్యపై అంచనాలు వివిధాలుగా ఉన్నాయి. చాల జాతులను ఇంకా గుర్తించలేదు. 760 కోట్ల పైచిలుకు మానవులు భూమిపై నివసిస్తూ, భూమి జీవావరణంపై, దాని సహజవనరులపై ఆధారపడి ఉన్నారు.  మానవులు అనేక సమాజాలు, సంస్కృతులను ఏర్పరచారు. రాజకీయంగా ప్రపంచంలో 200 సార్వభౌమిక రాజ్యాలున్నాయి.

  ఆకాశంలోని సూర్యబింబం దాదాపు చంద్రబింబం అంత చిన్నదిగా ఉంటుంది. అయితే అదీ భ్రమే. ఆ భ్రమకి కారణం భూమికీ ఆ సూర్యుడికీ మధ్యనున్న దూరం భూమికీ చంద్రుడికీ మధ్యనున్న 400 రెట్లు ఎక్కువ కావడమే.

భూమి చుట్టూ ప్రయాణం చేయాలని మాగెల్లాన్ సూచించినప్పుడు. అతని సమకాలీమలందరూ అతన్ని ఎలా వ్యతిరేకించారో గుర్తుకు తెచ్చుకుందాం. వాళ్ల వాడవలో ప్రధానమైన విషయం లోకజ్ఞానం. "ఒక పరళరేఖ వెంబడి ఒకే దిశలో ప్రయాణం చేస్తుంటే బయల్దేరిన చోటికే అతను ఎలా తిరిగి రాగలడు?" అని వాళ్లు మండిపడ్డారు. అలా జరగవచ్చుననే విషయం వారికి ఎంతో విపరీతం అనిపించింది. దాన్ని
వాళ్ల ఊహించుకోలేకపోయారు. కాని వాస్తవం 'మాగెల్లాన్' భావం నిజమని నిరూపించిందని మీకు తెలుసు.

భూగోళానికి రెండో వైపున మనుష్యులున్నారనే భావం ఆ విధంగానే తిరస్కరించబడింది. భూమి గుండ్రంగా ఉంటే కింద వైపున మనస్యులు ఎలా ఉండగలరు? అప్పుడు వాళ్లు తలకిందులుగా నడవాల్సి వస్తుంది.
భూమి మీద జీవం ఏర్పడడానికి, మానవ మహాశయులు ఉద్భవించటానికి గల అనుకూల పరిస్థితులు తెలుసుకుందాము.

1. సూర్యుడు, భూమి పరిమాణాలు వాటి మధ్య దూరం సరిగా జీవోత్పత్తికి అనుకూలంగా ఉంది. సూర్యుడు మరింత పెద్ద నక్షత్రమయినా, లేక చిన్నదయినా, అలాగే భూమి ఉన్నదానికన్న పెద్దదయినా, లేక చిన్నదయినా పరిస్థితులు వేరుగా ఉంటాయి. భూమి, సూర్యుడి ద్రవ్యరాశులు ఇప్పుడున్నట్లుగానే ఉండాలి.

2. సూర్యుని చుట్టూ తిరిగే లోపలి గ్రహాలు మెర్క్యురి, వీనస్, భూమి (ఎర్త్), మార్స్. వీటిని సూర్య వ్యవస్థలోని మరే వస్తువులు (గ్రహశకాలు, ఉల్కలు లాంటివి) ఢీకొట్టకుండా భారీ బాహ్య గ్రహాలు (ముఖ్యంగా యురేనస్, సాటరన్) రక్షిస్తున్నాయి. గ్రహశకాలు, ఉల్కలు లాంటి వాటి కక్ష్యలను భూమిని తాకకుండా మార్చి వేస్తాయి..

3. సూర్యుడికి, భూమికి మధ్య దూరం 15 కోట్ల కి.మీ. ఒక లక్ష కిలోమీటర్లు సూర్యుడికి దగ్గరగా ఉంటే నీరు ఆవిరై పోవచ్చు. లక్ష కిలోమీటర్లు దూరంగా ఉంటే నీరు ఘనీభవించవచ్చు. ఏ పరిస్థితిలోను ఇప్పుడున్న జీవం లాంటిది ఉండదు.

4. సూర్యుడి ఉపరితల ఉష్ణం 6000°C ఈ వేడి భూమిని వాతావరణం గుండా చేరుకునేసరికి కిరణజన్య సంయోగక్రియకు కావలసిన వేడి, సముద్రాలు వేడెక్కి మేఘాలు ఏర్పడటానికి, వర్షానికి, వ్యవసాయానికి, జీవం ఉనికికి సరిపోతుంది.

5. భూ భ్రమణానికి 24 గంటల సమయం కావాలి. ఇది చాలా అనుకూల భ్రమణం. గంటకు ఒక భ్రమణం చేస్తే రోజుకు 24 సార్లు తన చుట్టు తాను తిరుగుతుంది. అంటే అరగంట పగలు అరగంట రాత్రి ఒకదాని తరువాత ఒకటి సంభవిస్తే జీవం ఉంటే ఉండవచ్చు కాని ఇప్పటి జీవం ఉండదు. అలాగే నెలకొకసారి భూమి తన చుట్టు తాను తిరిగితే 15 రోజులు పగలు, 15 రోజులు రాత్రి ఉంటాయి. 15 రోజుల పగటి వేడికి పంటలేం పండుతాయి. ఊహించలేని పరిణామాలు ఉంటాయి.

6. భూమి సూర్యుడి చుట్టూ దాదాపు వృత్తాకార కక్ష్యలో తిరగటం అదృష్టం. అదే ఎక్కువ దీర్ఘ వృత్తాకార కక్ష్య అయితే సంవత్సరంలో కొంత భాగం అతి వేడిగాను, కొంత భాగం మంచు ఏర్పడేటట్లుగా ఉంటుంది.

7. భూమి భ్రమణం చేసే అక్షం, సూర్యుని చుట్టూ భూమి తిరిగే కక్ష్యకు 23.5° వాలులో ఉంది. ఈవాలు అక్షం మీద భూమి తనచుట్టు తాను భ్రమణం చేసుకుంటూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నది. ఈ వాలు వల్లనే ఋతువులు ఏర్పడుతున్నాయి. భూమి అక్షం వాలుగా లేకపోతే ఋతువులు ఉండవు వ్యవసాయం ఉండదు.

8. భూమి ఉపరితలం 70% నీటితో 30% నేలతో (land కొండలు, గుట్టులు, చదును భూమి, ఎడారులు, ఆర్కిటిక్ మంచు, అంటార్కిటిక్ ఖండంమీద మంచు, హిమాలయాలు, అల్ప్స్, ఇంకా అనేక రకాలయిన కొండలు, నేలలు) ఉన్నది. భూమి మీద 70% సముద్రాలు ఉండటం వల్ల ఎండాకాలంలో నీరు ఆవిరయిపోయి ఋతుపవనాలేర్పడి మేఘాలు వర్షిస్తాయి. పంటలు పండుతాయి. అడవులు పచ్చగా ఉంటాయి. మృగాలు సంతోషంగా ఉంటాయి.

9. ప్రపంచ పటం చూడండి. అంతకంటే మంచిపని గ్లోబ్ను చూడండి. సముద్రాలు, భూమి పంపిణి అధ్యయనం చెయ్యండి. సముద్రాలు, పర్వతాలు, ఖండాలు ఇప్పుడున్నట్లుగా వాటి పంపిణీ ఉంటేనే భూమిమీద ప్రస్తుత అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. వీటి పంపిణీలో తేడాలు వస్తే ఋతుపవనాలు మారతాయి. ఇంకా అనేక మార్పులు రావచ్చు. భూమి చరిత్రలో దక్షిణాన ఉన్న ఖండాలన్ని ఒకప్పుడు అంటార్కిటికాతో కలిసి దక్షిణ ధృవానికి దగ్గరలో ఉన్నాయి. అప్పుడు ఇండియాతో సహా మొత్తం మంచుతో కప్పబడ్డది. సముద్రం - నేల ప్రస్తుత పంపిణి అన్నిటికీ అనుకూలం.

10. భూమికి అయస్కాంత తత్వం ఉండటంకూడా భూమీద జీవానికి అనుకూలం. భూమికి ఈ అయస్కాంత ధర్మంలేకపోతే సూర్యవికిరణం (Solar radiation) భూమి ఉపరితలాన్ని తాకుతుంది. ఆశక్తికి ఏజీవం మనుగడ సాగించలేదు. భూమికి అయస్కాంత ధర్మం ఉండటం ఒక వరం.

11. భూమి వాతావరణంలోని సుమారు 20% ఆక్సిజన్ మనకు, ప్రాణులన్నిటికి ప్రాణవాయువు. 12. భూమి ఉపరితలంపైన 250 కి.మీ. ఎత్తులో అయనో ఆవరణమున్నది. దీంట్లో 70% నైట్రోజన్ అయాన్లు, 20% ఆక్సిజన్ అయాన్లు 10% హీలియమ్ అయాన్లు ఉంటాయి. ఓజోన్ పొర 03
45 కి. మీ. ఎత్తులో ఉన్నది. ఇవి కాక వాన్ అల్లాన్ మండలాలు (Van Allen Belts) రెండు ఉన్నాయి. ఇవి ఒక దానిపై ఒకటి భూమి అయస్కాంత క్షేత్రంలో ఇరుక్కున్న ప్రోటాన్ల, ఎలక్ట్రాన్ల మండలాలు. సూర్యుణ్ణించి విడుదలయిన ఈ కణాలు ఉపరితలాన్ని చేరకుండా అయస్కాంత మండలాల్లో బంధించబడుతున్నాయి. ఈ మూడు మండలాలు (అయనో ఆవరణము, ఓజోన్ మండలము, వాన్ అల్లాన్ మండలాలు) కలిసి సూర్యుణ్ణించి, విశ్వం నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను, ఎక్సరేలు భూమి ఉపరితలాన్ని చేరకుండా అడ్డుపడి భూమిమీది జీవాన్ని రక్షిస్తున్నాయి. ఈ మండలాలు లేకపోతే జీవం మనుగడ బహుశా ఉండకపోవచ్చు. కార్లు విడిచే వాయువులు, రిఫ్రిజిరేటర్లు లాంటి చల్లబడటానికి ఉపయోగించే ఉపకరణాలలో వాడే వాయువులు విరివిగా విడుదలయి ఓజోన్ పొరలో రంధ్రాలేర్పడుతున్నాయని తత్ఫలితంగా కొంత వికిరణం భూమికి చేరి భూమి వేడెక్కుతున్నదని శాస్త్రజ్ఞులు ఆందోళన చెందుతున్నారు.

13. సౌర వ్యవస్థ పాలపుంత కేంద్రం నుంచి 2/3 వంతుల దూరంలో కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తున్నది. పాలపుంత గాలాక్సీలో ఇదొక సురక్షిత మండలం. కేంద్రానికి మరికొంత దగ్గరగాగాని, లేక దూరంగా గాని ఉంటే పరిస్థితులు వేరే విధంగా ఉండేవి. అసలు గ్రహాలు ఏర్పడేయో కాదో కూడా తెలియదు.

14. స్టెఫెన్ హాకింగ్ (12) ప్రకారం ఒక గ్రహం మీదున్న గ్రహవాసులకు వాళ్ళున్న పర్యావరణం తమకు అత్యంత సంతృప్తికరంగా ఉన్నదని భావిస్తారు. పర్యావరణం (environment) మన ఉనికిని నియంత్రిస్తున్నదని కూడా చెప్పవచ్చు. దీన్నే దుర్బల మానవ సూత్రము (weak anthropic principle) అంటారు. ఈ సూత్రాన్నుపయోగించి శాస్త్ర భవిష్యత్తు చెప్పవచ్చు. విశ్వంలో మన ఉనికి ఉండాలంటే కార్బన్ లాంటి (carbon C) మూలకాలు ఉండాలి. ఇలాంటి తేలికపాటి. మూలకాలు నక్షత్రాలలోపల తయారు చేయబడతాయి. ఒక గ్రహంమీద మన ఉనికి ఉండాలంటే వేడి నక్షత్రాలు ఉండాలి. నక్షత్రాలు ఉండాలంటే గాలాక్సీలు ఉండాలి. గాలాక్సీలు ఉండాలంటే గాలాక్సీల గుంపులుండాలి. ఇవన్నీ ఏర్పడటానికి బిగ్ బాంగ్ ఎప్పుడు ఏర్పడ్డది? సుమారు 1400 కోట్ల సంవత్సరాలక్రితం. కాబట్టి మన ఉనికికి అవసరమయిన పర్యావరణాన్ని, ఆ పర్యావరణం ఏర్పడటానికి కావలసిన సమయాన్ని ఊహించవచ్చు. ఈ ముఖ్య కారణాలే కాకుండా అనేక ప్రత్యేక పరిస్థితులవల్ల భూమిపై జీవం మనుతున్నది.

15. ఉదాహరణకు వ్యవసాయానికి మన్ను అవసరం. రాత్రుళ్ళు, పగళ్ళలోని శీతల తాప తేడాలవల్ల, నీటి (వర్షం) ఒరిపిడికి శిలలు శిథిలాలై మన్ను ఏర్పడుతుంది. గడ్డికి, మొక్కలకు, వృక్షాలకు పట్టు దొరుకుతుంది. పచ్చదనం వృద్ధి అవుతుంది. జీవులకు ఆహారం పుష్కలంగా సమకూరుతుంది.


1400 కోట్ల సంవత్సరాల వయసుగల విశ్వంలో కేవలం 470 కోట్ల సంవత్సరాలుగల భూమిలో భారీ మూలకాలు సమృద్ధిగా ఉన్నాయి. సూర్యుడు, భూమి, మిగతా గ్రహాలు, సహజ ఉపగ్రహాలు, గ్రహకలశాలు అన్నిటితో సౌర వ్యవస్థ ఉద్భవించేనాటికి విశ్వం అప్పటికే దాదాపుగా 1000 కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నది. 

విశ్వంలోని నక్షత్రాలలో తయారుకాబడ్డ మూలకాలతోనే భూమి ఏర్పడ్డది. భూమి మీద నివసించే యావత్తు జీవరాసి భూమ్యాధారంగా ఏర్పడ్డవి కాబట్టి వాటిలోని మూలకాలన్ని ఒకప్పుడు నక్షత్రాలలో ఉద్భవించినవే. అలాగే మానవ శరీరం యావత్తు మూలకాలతో నిర్మితమైనదే. పది లక్షల భాగాలలో (PPM) 0.1 నుంచి 61 శాతం వరకు చాలా మూలకాలు మన శరీరంలో ఉంటాయి. ఆరోగ్యవంతుడైన మనిషి లో  ఉండాల్సిన మూలకాలు 24. అవి ఆక్సిజన్  కార్బన్ - , హైడ్రోజన్ -  నైట్రోజన్ -  కాల్షియమ్- ఫాస్ఫరస్-సల్ఫర్ -  పొటాషియమ్ -  సోడియమ్ -  క్లోరిన్ - మెగ్నీషియమ్ -  సిలికాన్ -  ఇనుము - ఫ్లోరిన్ - , జింక్ - 33 , రాగి - , మాంగనీస్ - , టిన్ -  అయోడిన్ -  సెలీనియమ్ - . వెనాడియజమ్ -  మాలిబ్దినమ్ -  క్రోమియమ్ -  కోబాల్ట్ 


న్యూటన్ చెప్పిన గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారం చంద్రుడు (లేక సూర్యుడు) భూమినీ, దానిమీద ఉన్న నీటిపొరనూ ఆకర్షిస్తాడు. దగ్గరగా ఉన్న వస్తువులమీద ఈ ఆకర్షణశక్తి అధికంగానూ, దూరంగా ఉన్న వస్తువులమీద తక్కువగానూ ఉంటుంది. కనుక, చంద్రుడు తనకు దగ్గరగా సరిగ్గా "క్రింద ఉన్న నీటిపొరను (బొమ్మలో "కా దగ్గర) అత్యధికంగా ఆకర్షిస్తాడు. నీటిపొర భూమండలాన్ని గట్టిగా అంటిపెట్టుకుని కాక, "వదులు"గా ఉండడంచేత, "క" దగ్గర సముద్రపుమట్టం మిగిలిన చోట్లకన్న పైకి. లేస్తుంది. దానినే పోటు అంటాము.

చంద్రుడికి దూరంగా ఉన్న "ట, డ" అనే చోట్ల ఆకర్షణ తక్కువగా ఉంటుంది. కనుక, అక్కడ నీటి మట్టం మిగిలిన చోట్లకన్న తక్కువ, అదే: పాటు.

భూచంద్రులమధ్య దూరం 2,38,840 మైళ్లు అయింది. నెల 27 1/3 రోజులకు సమానం అయింది.
జార్జి డార్విన్ సిద్ధాంతం ప్రకారం - భూమి ద్రవరూపంలో ఉన్న రోజులకోలో అత్యంతవేగంగా తిరగడంవల్ల ఈ ద్రవం గోళాకారంలో కాక సాగికోలగా (అండవృత్తాన్ని హ్రస్వవ్యాసంమీద గిరగిరా తిప్పిన ఆకారంలో) తయారైంది. దానికి తోడు సూర్యాకర్షణవల్ల ఈ ద్రవంలో బ్రహ్మాండమైన పొంగులు బయలు దేరేయి. వీటివల్ల భూమిలో నుంచి కొంత భాగం తెగిపోయింది. అదే చంద్రుడు. ఆ చంద్రుడు మెల్లి మెల్లిగా జరిగి ఇప్పుడున్న స్థితికి వచ్చాడు.

భూచంద్రులమధ్య దూరం 2,38,840 మైళ్లు అయింది. నెల 27 1/3 రోజులకు సమానం అయింది.."విపులా చ పృథ్వీ!" అన్నారు. భవభూతి మహాకవి. ఇది తలచినప్పుడల్లా నాకు నవ్వొస్తుంది.

ఏమీ అది నిజమేగా? భూమి 7900 మైళ్ళ వ్యాసంగల 500,00,00,00,00,00,00,00,00,000 టన్నుల బరువుగల గోళం .

భూమండలపు ఉపరితల వైశాల్యం 19,60,00,000 చదరపు మైళ్లు. ఒక రోజులో

భూమిమీద పడే సూర్యరశ్మి 82×10 " యూనిట్లకు సమానం. భూమి స్వీకరిస్తున్న ఈ శక్తి సూర్యుడు విడుదల చేస్తున్న మొత్తం శక్తిలో 200 కోట్లవ వంతు మాత్రమే! మిగిలినదంతా అనంతాకాశంలోకి ఎడతెగని ప్రయాణం చేస్తూ,
"వ్యర్ధం" అయిపోతుంది.

భూమి ( సంస్కృతం : भूमि , రోమణీకరణ : భూమి ) గా కూడా పిలిచే Bhudevi మరియు వసుంధర , ఉంది హిందూ మతం దేవత సూచిస్తున్న భూమి . ఆమె దేవేరి ఉంది వరాహ , ఒక అవతార్ దేవుని విష్ణు , అందువలన ఆమె కొన్నిసార్లు Varahi గా సూచిస్తారు. ఆమె నరకాసుర మరియు మంగళ తల్లిగా పేర్కొనబడింది . దేవత సీతా [ లక్ష్మీ ] సీతా వంటి భూమి తనయ భూమి కనుగొనబడింది గా సూచిస్తారు జనక .లక్ష్మి యొక్క 3 కోణాలలో ఆమె ఒకటి, మరొకటి శ్రీదేవి మరియు నీలాదేవి.

భూచంద్రులమధ్య దూరం 2,38,840 మైళ్లు అయింది. నెల 27 1/3 రోజులకు సమానం అయింది.భూమి నీటిలో మునిగి ఉండటానికి హిరణ్యాక్షుడు కారణం అని పై కథ లేదు. కాని హిరణ్యాక్షుని మీద ఏదో నేరం మోపాలి కాబట్టి భూమిని నీటిలో విసిరేశారు. - దావగా చుట్టి విసిరేశాడనీ చెప్పాడు. భూమి అంటే చాపలాగా ఒక దుప్పటిలా

చదరంగా ఉంటుందనే ఊహ ఉన్న రోజుల్లోని కథ ఇది. బ్రహ్మ వైవర్త పురాణంలోపు.
ఈ విషయం ప్రస్తావించారు. మిధ్యారోపణలతో వైరి వర్గాలను చంపటం అనేది అప్పటి నుంచి ఉంది.

ఒక జలప్రళయం తర్వాత తిరిగి సృష్టి మొదలు కావలసి ఉన్న సమయంలో జరిగిన సంఘటన హిరణ్యాక్షునికీ వరాహ రూపంలో ఉన్న విష్ణువుకూ జరిగిన యుద్ధానికి కారణమయిందని ప్రచారం జరిగింది. ఒక ప్రళయం తర్వాత సృష్టిచేసి ప్రజాపాలన చేయవల సిందిగా బ్రహ్మ మనువును ఆదేశించాడు. అప్పటికి భూమి నీటిలో మునిగి ఉంది. దానిని బయటకు తీస్తే పాలిస్తానంటాడు మనువు. దానిని బయటికి తీసేవారెవరు? బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు. అతని ముక్కు నుంచి ఒక పందిపిల్ల (వరాహ శిశువు)ఊడిపడింది. అదే పెద్ద వరాహమై నీటిలో మునిగి ఉన్న భూమిని పైకి తెచ్చింది. సందర్భంలో వరాహం హిరణ్యాక్షునితో యుద్ధంచేసి అతనిని చంపిందట. అప్పటికి కూడ హిరణ్యాక్షునిదా? హిరణ్యాక్షుడు భూమిని పాలిస్తూ ఉన్నాడా? అందుకే అడ్డుకున్నార అనేది ప్రశ్న. ఆ వరాహాన్ని యజ్ఞ వరాహుడుగా వ్యవహరిస్తూ భూమిని స్త్రీగా చెబుట్ట వరాహుడు భూమిని వివాహం చేసుకున్నాడని కథ అద్భుతంగా అల్లేశారు. అప్పుడ వాళ్ళిద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టాడు. నరకాసురుడు. ఇది చాలా పురాణాలలో ఉ కథ యజ్ఞాల ప్రచారానికి ఇది ఉపకరించింది.

ఫ్లాట్ ఎర్త్ సిద్ధాంతాన్ని నమ్మే పాత విశ్వాసులు ఉన్నారు.ప్రభుత్వం మరియు నాసా ప్రజలను గందరగోళానికి మరియు మోసగించడానికి చేసిన కుట్ర,

క్రీ.శ. 499లో ఆర్యభట్ట 𝞹 విలువను భూమి పరిధి, వ్యాసంతో పోల్చి చెప్పారు. భూమి వ్యాసం 20,000 కి. మీ. అయిన దాని పరిధి, 62832 కి.మీ.

కావున 𝞹 = 62832/20,000 = 3.1416 అని ఈ విలువను మొదటి నాలుగు దశాంశ స్థానాల వరకు తెలియజేసి, ఇది ఉజ్జాయింపు విలువ మాత్రమే అని చెప్పిన మొదటి సారి గణితవేత్త మొదటి ఆర్యభట్ట. అయితే ఆర్యభట్ట-2 భూమి వ్యాసము 20,000ను 22చే గుణించి 7చే భాగించిన వృత్త పరిధి వస్తుందనీ చెప్పాడు.

మనం నివసించే భూమి బల్లపరుపుగా వుంటుందని, అది కదలకుండా వుంటుందనీ, సూర్యుడు భూమిచుట్టూ తిరుగుతుంటుందని చెప్పారు. అందుకే భూమి బల్లపరుపుగా వుంటుందని బైబిలు మొదలైన మత గ్రంధాలలో రాసి పెట్టారు. అదంతా ప్రాథమిక దశలోని విజ్ఞానం. కాని కాలం చాలా మారింది. మాటల రూపంలో అంటే ఇంద్రియ జననరూప విజ్ఞాన శాస్త్రం ప్రయోగ దశకు చేరుకొంది. ప్రయోగం ద్వారా ఋజువైతే దాన్ని విజ్ఞానం నమ్ముతున్నారు. అప్పుడు అది అనుభవంలోకి వస్తుంది. అనుభవమే శాస్త్రమన్న దానికి సరైన సమాధానం అవుతుంది.

దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించినా, చూచినా, భూమి కేంద్రంగా చెప్పిన జ్యోతిష సిద్ధాంతం అంతా తప్పు. ఈ విశ్వానికి భూమి కేంద్రంగాదు. భూమి చుట్టూ సూర్యుడు తీరటం లేదు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది.

భూమికి రెండు రకాల చలనాలున్నాయి. 1 భూమి తనచుట్టూ తాను తిరుగుతుంది. దీన్ని

భూభ్రమణం అంటారు. 2. భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది.వుంటుంది. దీన్ని భూమి పరిభ్రమణం అంటారు. మొదటి దానివల్ల రాత్రింబవళ్ళేర్పడుతాయి. రెండో పరిభ్రమణం వల్ల కాలాలేర్పడుతున్నాయి. భూమి తిరుగుతుందనేది ఋజువైన విషయం. కాబట్టి మనం నివశిస్తున్న విశ్వానికి భూమి కేంద్రం కాదనీ, సూర్యుడు కేంద్రమనీ ఋజువవుతుంది.

కేంద్రక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని పుట్టిన జ్యోతిషం సూర్యుకేంద్ర సిద్ధాంతం వచ్చినా చెల్లుతుందా ? మేం చెప్పాం కాబట్టి యిది చెలామణి కావలసిందేనంటారా? అభిప్రాయం మార్చుకోవటం వివేకం - విజ్ఞానం వున్నవాడు చేయవలసినపని అట్లా చేయకపోతే అతణ్ణి పిచ్చివాడనో - అవివేకనో అనాలి.

Comments

Popular posts from this blog

Darwin theory

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం