ఎవరూ ఎవ్వర్నీ మార్చలేరు


ఎవరూ ఎవ్వర్నీ మార్చలేరు, ఆలోచించేలా మాత్రమే చేయగలరు ఎవరికి వారే మారాలి. ఒకరు చెపితే మారేవారు, వేరే వారు వేరేలా చెపితే వేరేలా మారవచ్చు. ఒత్తిడితో మార్పు తెస్తే, ఒత్తిడి ఉన్నంత కాలం మాత్రమే ఆ మార్పు ఉంటుంది

ఎవరినైనా ఆలోచించే వారిగా ప్రశ్నించే వారిగా, నిజం తెలుసుకునే వారిగా, శాస్త్రీయ దృక్పథం ఏర్పరుచుకునే వారిగా ప్రోత్సాహించాలి.

హేతువాదిగా ఉండాలి అనుకుంటే ఎవరికి వారే హేతుబద్దంగా ఆలోచించాలి. అందరికీ ప్రశ్నించే తత్వం రావాలి, ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి. ప్రపంచంలో ఆలోచించే వాళ్ళు తక్కువ, అనుకరించే వాళ్ళు ఎక్కువ. అందుకే మతాలు ప్రాభల్యం పెరగడానికి అనుకరణే ఒక కారణం. ప్రజల్లో ప్రశ్నించే తత్వం, శాస్త్రీయ దృక్పధం లోపించడం కూడా దేశం వెనుకబాటు తనాన్నికి ఒక కారణం

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata