దేవుని పుట్టుక





    ఆహార ధాన్యాలు పండించడం మొదలుపెట్టాక విత్తనాలు మొలకెత్తి సమృద్ధిగా పంటలు ఇచ్చే కార్యకలాపం వెనక ఒక దివ్యమైన శక్తి ఉందని నమ్మే వాళ్ళు, పంటలు బాగా పండాలంటే వర్షం కురవాలి అనే అవగాహన పెరిగింది. అలా వర్షం కురవడానికి కూడా ఏదో ఒక శక్తి కారణం అనుకునేవాళ్ళు. ఈ విధంగా తమకు తెలియని ప్రకృతి ధర్మాల వెనుక ఒక శక్తి ఉందని ఆశక్తి ఒక్కో దేవుని గా భావించారు. ప్రాచీన నాగరికత (3150 BC) కలిగిన ఈజిప్టు దేశంలో మమ్మీలను పూజించేవారు. మమ్మీలను పూజించడం అంటే మరణించిన తమ ప్రాచీనులను పూజించే ఆచారం. ప్రాచీన తెగ సంప్రదాయంలో నాయకుడు మరణించినప్పుడు వారి స్మారక చిహ్నాలు నిర్మించేవారు. వారే కాలక్రమంలో దేవుళ్లు గా పరిణామం చెందారు. వీళ్ల తర్వాత దశలో స్థానిక దేవుడుగా ఆరాధింపబడుతున్నారు ఉదాహరణకు ఇజ్రాయేలీయులు ప్రాచీన కాలంలో బహుదేవతారాధన చేసేవారు. యెహోవా దేవుడు కూడా ప్రాచీన తెగలలో ఒక తెగకు సంబంధించిన దేవుడి గా ఉంటాడు. కాలక్రమంలో వివిధ దేవతల లో ఉండి గుణాలన్నీ ఒక దేవుడు గా రూపు దాల్చినట్టుగా సమాజం భావపరిణామం చెందింది. అలా చెందిన దేవుడే యెహోవా మరణం తర్వాత మిగిలేదేమీ లేదా అని ఆలోచించిన మానవుడు భూమిపై జీవించడానికి అవసరమైన వెలుతురు నీరు నిప్పు గాలి మొదలైన వాటిని ప్రసాదిస్తూ అప్పుడప్పుడు భయకంపితులను చేస్తున్న ప్రకృతి శక్తులపై ఏదో ఒక అతీత శక్తి ఉందన్న భావన దేవుడి భావాన్ని కలిగించాయి. అన్ని భావాలు మాదిరిగానే దేవుడి భావం కూడా పరిణామం చెందుతూ వచ్చింది.
        కాలక్రమంలో వివిధ దేవతల లో ఉండే గుణాలన్నీ ఒకే దేవుడులో ఉండే విధంగా భావించడం జరిగింది. ఇలా దైవ భావన సమాజంలో భావపరిణామం చెందుతూ వస్తోంది. ఇపుడు అన్నింటికీ దేవుడు అనకుండా
ఏదో ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తోందని భావించేవారు కొత్తగా తయారయ్యారు. ఈ శక్తినే దేవుడు అందాం అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.

గ్రాంట్ అల్లెన్
(ఎవల్యూషన్ ఆఫ్ ది ఐడియా ఆఫ్ గాడ్)


Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata