Sapiens : A Brief History of Humankind

https://drive.google.com/file/d/19uNkYO_Dx1EIhXDb9I4AQ4tQhUASAp_s/view?usp=drivesdk

       photo: Amazon.in
యువాల్ నోవా హరారి రచించిన 'Sepience : A Brief History of Humankind.' ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పాఠకులని అబ్బురపరిచిన పుస్తకం. చారిత్రకంగా వాస్తావాస్తవాలను పక్కనబెడితే మానవ పరిణామక్రమం గురించి లోతైన సమాచారాన్ని ఈ పుస్తకం అందించిందని చెప్పవచ్చు. రాతియుగం నాటి మానవుడి  నుంచి నేటికాలపు ఆధునిక మానవునిగా రూపాంతరం చెందడం వెనుకగల చోదకశక్తిని వివరించడంలో హరారి సఫలీకృతుడయ్యాడనే చెప్పవచ్చు. 2011లో మొదటగా హీబ్రూ భాషలో వెలువడిన ఈ గ్రంథం తరువాత 2014లో ఇంగ్లీషులోకి అనువదించబడి సామాన్యుల ప్రశంసలు అందుకుంటూనే మేధావుల విమర్శలు సైతం ఎదుర్కొంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45 భాషలలోకి అనువదించబడింది. ఈ పుస్తక రచయిత యువాల్ నోవా హరారి హీబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేంలో చరిత్ర డిపార్ట్ మెంట్ లో ప్రొఫెసర్. 

మనవ పరిణామదశలో భాగంగా ఆదిమ మానవుని మొదలుకోని ఆధునిక మానవుని వరకు మానవుడు వివిద దశలలో పొందిన సంక్రమణలను ఈ పుస్తకంలో వివరించాడు. గడిచిన డెబ్బై వేల సంవత్సరాల కాలంలో హోమోసెపియన్స్ (తెలివైన మనిషి) ఏ విధంగా ఈ నేలపై తన ఆధిపత్యాన్ని ఏర్పరుచుకున్నాడు?. మిగతా జీవుల కంటే ఎలా ముందంజ వేయగలిగాడు? 

హరారి సెపియన్స్ చరిత్రను నాలుగు ముఖ్యభాగాలుగా విభజించాడు.

1.ఆలోచన (అభిఙ) విప్లవం(క్రీ.పూ 70,000,ఈ కాలంలో సెపియన్ ఆలోచించడం అలవర్చుకున్నాడు).
2.వ్యవసాయ విప్లవం  (క్రీ.పూ 10,000,వ్యవసాయ అభివృద్ధి దశ).
3.మానవ ఐక్యత కాలం (క్రీ.పూ.5000, మానవ చరిత్రలో రాజ్యాల  ప్రారంభం)
4.శాస్త్ర సాంకేతిక విప్లవం (క్రీ.శ.1500, శాస్త్ర సాంకేతిక విప్లవం)

ఈ ప్రపంచంలోని జీవుల మీద మానవుని ఆధిపత్యమే నడిచిందని మనిషి అనుకోవడం పరిపాటే. కాని చాలాకాలం క్రితమే మానవుడు పిరమిడ్ ల నిర్మణం చేపట్టి నేడు చంద్రుని మీద కూడ నడిచేంత ప్రగతిని సాధించాడు.కాని దానిలో పెద్ద విషయం లేదంటాడు హరారి. చారిత్రకపూర్వ మానవున్ని తెలుసుకోవడం ముఖ్యమైన విషయం అంటాడు. లక్ష సంవత్సరాల క్రితమే హోమోసెపియన్ మిగతా హోమోలకన్న ముందుగా పరిణామ దశను అనుభవించాడు. ఒకరకంగా ఈ ఆలోచనా ఆధిపత్యపు పోటీలో హోమోసెపియన్ ముందు వరసలో ఉన్నాడు. మన పూర్వికులైన ఆది మానవులు తూర్పు ఆఫ్రికాలో, మన బందువులైన నియాండర్తలెన్సిస్ (నియాండర్తల్ మనిషి) యూరప్ లో నివసించారు. హోమో ఎరక్టస్ ఆసియాను నివాసయోగ్యంగా చేసుకోగా, హోమో సోలెన్సిన్ జావ ద్వీపాన్ని ఆవాసంగా చేసుకున్నాడు. 
ప్రతి మనిషి తనకే సరిపోయే పర్యావరణాన్ని అనుసరించి జీవనాన్ని ప్రారంభించాడు. కొందరు పెద్దగా ఉండి భయంలేని వేటగాళ్ళుగా అడివిపై ఆధిపత్యం వహించగా, మరికొందరు పొట్టిమనుషులు ఆకులు అలములు ఏరుకుంటూ జీవనాన్ని సాగించారు. వారి మధ్య జరిగిన సాంకర్యం వల్ల ఇతర జాతుల ఆవిర్భావం జరిగింది. యూరోప్ లో చాలా జాతులకు నియాండర్తల్ మనిషి పూర్వికుడని మానవ శాస్త్రవేత్తలు తేల్చారు.
అయితే అన్ని మానవజాతులలో నేడు హోమోసెపియన్ మనిషి ఒక్కడే ఎందుకు జీవించి ఉన్నాడు? ఎందుకు హోమోసెపియన్ ఒక్కడే విజయవంతంగా మనుగడ సాగించాడు? మిగత హోమోలు ఎందుకు మనుగడ సాగించలేకపోయారు?. హోమోసెపియన్ కున్న ఆలోచన శక్తినే మిగతా హోమోలతో అతన్ని ప్రత్యేకపరిచిందని హరారి విశ్వసిస్తాడు. డెబ్బైవేల ఏళ్ళ క్రితమే హోమోసెపియన్ ఈ ఆలోచనా విప్లవాన్ని ప్రారంభించాడని, దానిని తూర్పు ఆఫ్రికా తీరాలకు వ్యాప్తి చేశారని అంటాడు. 
మిగతా హోమోలకు పెద్ద మెదడు ఉన్నప్పటికినీ హోమోసెపియన్ ఒక్కడు మాత్రమే ఎందుకు ఆలోచించగలిగాడు? కోతులు,తోడేళ్ళు, ఇతర జంతువులకు గుంపులుగా ఉంటూ జీవించే నేర్పు ఉన్నప్పటికినీ గుంపులో వాటి సంఖ్య తక్కువ ఉంటాయి. ఆ గుంపులు కూడ తక్కువే ఉంటాయి. కాని మానవుడు వాటిలా కాకుండా మిలియన్ ల జన సమూహంతో కలిసి జీవిస్తాడు.స్వేచ్చ, సమానత్వం,శాసనం, మతం, దేవుడు, పెట్టుబడిదారి వ్యవస్థ వంటి అంశాలు మన ఆలోచనల్లో ఉన్నప్పటికినీ మనందరిని ఏకతాటిపై నడిపి క్లిష్ట సమస్యలను సైతం అవలీలగా పరిష్కరించుకోడానికి మానవులు ముందుకు రావడమే అసలైన పరిణామదశకు పరాకష్ట అని హరారి అంటాడు.  
అయితే వ్యవసాయ విప్లవం మానవచరిత్రలో అతిపెద్ద తప్పు అని హరారి భావిస్తాడు. తన జీవనం కోసం ఆదిమానవుడు చేసిన వేట ప్రక్రియనే సరియైంది అని చెబుతాడు. వ్యవసాయ సమాజాలు కష్టించి పనిచేసే శ్రామికులను పెద్దమొత్తంలో తయారు చేస్తూ, తక్కువ సంఖ్యలో ఉండే ఉన్నతవర్గాలకు అధికారం కట్టబెడుతున్నాయని విమర్శించాడు. వేటాడి జీవించే ప్రక్రియనే అభిలాషించే హరారి అందులోని సాదకభాదలు విస్మరించాడు. మరణాలు, హింస, వేట సమాజంలో తక్కువ ఉంటాయని, వ్యవసాయిక సమాజంలో వాటి శాతం పెరిగిందని హరారి వాదిస్తాడు.వేల సంవత్సరాల చరిత్రను చెప్పిన హరారి ఒకేసారిగా తాత్వికుడిగా మారిపోయి భవిష్యత్తులో మనం ఎలా ఉండబోతున్నామో అని వేదన పడతాడు. కృత్రిమ మేధస్సు, జెనెటిక్ ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక పరిఙనం జీవజాలం మీద తీవ్ర ప్రభావం చూపుతుందంటాడు. మనిషి ఆనందానికి ప్రాథమిక కారణాలు ఉంటాయంటాడు. ఒకరకంగా హరారి ఆధునిక స్వేచ్ఛను, సంస్కృతిని నిరసిస్తాడు. సుదీర్ఘమైన మానవ చరిత్రలో మనిషి ఎప్పుడు సంతృప్తిగా ఉన్నాడు? ఒక పెద్ద మమ్మాత్ ను వేటగాళ్ళు నేలకూల్చినప్పుడా? వ్యవసాయదారుడు భూమిని దున్నినప్పుడా? మధ్యయుగంలో పాపభీతితో ఉన్నప్పుడా?.. ఇంకా ఆశ్చర్యంగా హరారి అడుగుతాడు: ఈ అశేష జీవజాలంలో మనం ఎవరం ? మన ప్రస్థానమెటు ? ఇవన్ని చరిత్ర ఎంత ప్రాచీనమైనదో అంతే పెద్ద ప్రశ్నలు.

*పై లింక్ ఓపెన్ చేసి సేపియన్స్ పుస్తకం డౌన్ లోడ్ చేసుకొని చదవండి*

Comments

Popular posts from this blog

Darwin theory

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం