శాస్త్రీయతను పరీక్షించాలి
జ్యోతీష్య, వాస్తు పండితులను చట్టాల పరిధిలోకి తేవాలి, వారి సేవల శాస్త్రీయతను పరీక్షించాలి, వారిని వినియోగ దారుల చట్టం తో పాటు ఇతర చట్టాల పరిధిలోకి తెచ్చి కట్టడి చేయాలి.
ఒక డాక్టర్ తన వృత్తిలో ఒక రోగి చావుకి కారణమైతే , నిజానిజాలు తెలుసుకోకుండా గొడవ పడతాం . . .
👉ఒక పోలీసాఫీసర్ విధి నిర్వహణలో భాగంగా నిజాలు రప్పించే ప్రయత్నంలో నిందితుడి చావుకి కారణమైతే అతను సస్పెండ్ అయ్యేవరకూ ధర్నాలు చేస్తాం . . .
👉ఒక డ్రైవర్ ఎదురుగా వస్తున్న వాహనాన్నో లేక ఏదైనా జంతువునో తప్పించబోయి తన వాహనంలోని ప్రయాణీకుల చావుకి కారణమైతే బట్టలూడగొట్టి బొక్కలిరిగేలా పచ్చడి చేస్తాం . . .
ఏదైనా బ్రిడ్జి గానీ , డ్యాం గానీ కూలిపోతే ఇంజినీర్ ని శిక్షిస్తాం. . .
ఇలాంటివే ఇంకా ఎన్నో . . .
🌹మరో చిన్న ప్రశ్న ::🌹
👉ఒక ఉద్యోగస్తుడు ఎంతో కష్టపడి , ఎన్నో సేవింగ్స్ చేసి ఒక bike లేదా car కొనుక్కొని , మంచి ముహూర్తంలో బయలుదేరి యాక్సిడెంట్లో చనిపోతే అలాంటి చెడ్డ ముహూర్తం పెట్టిన వాడి తప్పు లేదా ?
👉ఒక మంచి ముహూర్తంలో పెళ్ళి జరిపించిన జంట సంవత్సరం తిరగకుండా విడాకులు తీసుకుంటుంటే ముహూర్తం పెట్టిన వాడిని అడగకుండా , కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు ??
👉కోట్లు ఖర్చుపెట్టి మంచి ముహూర్తంలో సినిమా తీస్తే , ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యి నిర్మాత ఆత్మహత్య చేసుకుంటే అలాంటి ముహూర్తం పెట్టిన వాడిని తిట్టకుండా, దర్శకుడిని, ప్రేక్షకులని తప్పు పడతారెందుకు??
👉జ్యోతిష్య వాస్తు శాస్త్రాలను చూసి ఇల్లు కట్టుకుని వరదలు , భూకంపాలలో ఆ ఇల్లు కూలిపోతే వాస్తు పండితుడిని అడగకుండా , ప్రభుత్వాన్ని ఎందుకు డబ్బులు అడుగుతున్నారు?
👉వాళ్ళ వాళ్ళ వృత్తి ధర్మాలలో తప్పులు చేస్తూన్న డాక్టర్లు, లాయర్లు, పోలీసులు, డ్రైవర్లు , ఇంజినీర్లు మొదలైన వారిని శిక్షించడానికి చట్టాలు చేశారు , శిక్షలు వేస్తున్నారు. మరి ప్రతి పనికీ ముహూర్తాలు , జాతకాలు , జ్యోతిష్యం చూసి , పలానా time లోనే చేస్తే ఫలితం ఉంటుంది అని తప్పుడు ముహూర్తాలు పెట్టిన వారిని ఎందుకు తిట్టడం లేదు ? శిక్షించడం లేదు ?
👉వైద్యవిజ్ఞాన శాస్త్రాలు చదివి తప్పులు చేస్తే శిక్షలు ఉన్నాయి. మరి జ్యోతిష్య వాస్తు శాస్త్రాలు చదివి తప్పులు చేస్తే శిక్షలు ఉండవా ??
జ్యోతిష్యం , వాస్తు కూడా శాస్త్రాలు అని నమ్మి , వాదించే మేధావులు ఈ దిశగా చట్టాలు చేసి ఈ జ్యోతిష్య, వాస్తు పండితుల ఘరాన మోసాల బారి నుండి ప్రజల్ని రక్షించాలి. దోషుల్ని చట్ట ప్రకారం శిక్షించాలి.
. . . . . . DANNY
Comments
Post a Comment