మంత్రశక్తి అబద్దం
దేవుడూ, దెయ్యం రెండూ అబద్దమే ! అలాగే పూజారి శ్లోకాల్లో, మత పెద్దల ప్రార్థనల్లో, భూతవైద్యుని మంత్రాల్లో, పదాలు, మాటలు, శబ్దాలుంటాయి తప్ప వాటికి శక్తులుండవు, కాబట్టి మంత్ర శక్తి కూడా అబద్దమే !!
""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
దైవానికీ, దెయ్యానికీ రెండింటికి కూడా మంత్రాలతో సంభందం ఉంటుంది..
దేవుడి మంత్రాలను పూజలంటారు, దెయ్యాల మంత్రాలను క్షుద్రపూజలంటారు..
దేవుడికి ప్రజలకి మధ్యవర్తిగా పూజారి ఉన్నట్టే, దెయ్యానికి ప్రజలకి మధ్యవర్తిగా మంత్రకాడుంటాడు..
దేవుడికి పూజలు పగలు చేస్తారు,
దెయ్యానికి (క్షుద్ర) పూజలు రాత్రి చేస్తారు..
అక్కడ పసుపు, కుంకాలతో పాటు పూలుంటాయ్ ఇక్కడ పసుపు, కుంకాలతో పాటు పుర్రెలు ఉంటాయ్..
అక్కడ కట్టేది తమలపాకు 'కంకణం'లు, ఇక్కడ కట్టేది సత్తురేకు 'తాయెత్తు'లు..
అక్కడ తలకు ప్రతి రూపంగా కొబ్బరికాయ కొడతారు, ఇక్కడ రక్తతర్పణం కోసం తలనే నరుకుతారు..
అక్కడ దేవుల్లకు కోళ్లు, గొర్లు మేకలను బలి ఇస్తారు.
ఇక్కడ కూడా దయ్యాలకు, భూతాలకు కోళ్లు, గొర్లు మేకలను బలి ఇస్తారు..
దేవుడి పూజకు ఊరి మధ్యలో గుడులు,
దయ్యాల పూజకు ఊరవతల నిర్మానుష్య ప్రాంతం లేదా స్మశానమే అడ్డా..
వారికి పౌర్ణమి మంచిది, అమావాస్య చెడ్డది, గ్రహణమంటే హడల్.
వీరికి అంతా రివర్స్. వీరి క్షుద్ర పూజలన్నీ అమావాస్య రోజే జరుగుతాయి..
ఇలా దైవానికీ, దెయ్యానికీ చాలా సారుప్యతలున్నాయి. కానీ వాస్తవానికి రెండూ ఒక్కటే.
ఒకటి ప్రజల్ని పట్ట పగలే పీడిస్తే, మరొకటి అర్ధ రాత్రి పీడిస్తుంది..
ఒకటి భక్తి వంకతో జనాన్ని దోపిడి చేస్తే, మరొకటి జనాన్ని భయపెట్టి దోపిడి చేస్తుంది. ఈ రెండు బొమ్మా బొరుసుల్లాంటివి..
అమాయకత్వంతో జనం వాటిని నమ్మడం వల్లనే ఇవి రెండూ బతక గలుగుతున్నాయి. ఈ రెండింటిలో ఏదీ నిరూపితం కాదు. అంతా మోసం. నటన. ఈ రెండూ కూడా పక్కా మూఢ నమ్మకాలే..
మంత్రమంటే మాట అని అర్దం..
పూజారులు చదివే శ్లోకాల్లో, చెప్పే మాటల్లో, అలాగే ఇతర మతాల యొక్క మత పెద్దలు చేసే ప్రార్థనల్లో, అదే విధంగా భూత వైద్యులు చదివే (క్షుద్ర) మంత్రాల్లో ఏ మాత్రం శక్తి ఉండదు.
అన్ని మతాల వ్యవహారమూ అంతే..
అమాయక జజనాన్ని మోసగించడం, వారిని లూటీ చేయడం కోసమే ఈ తతంగమంతా..
దైవ భావన మానవుల బలహీనతల తో చిరకాలం నుండి సజీవంగా ఉంటూ వస్తుంది. ఒకర్ని చూసి మరొకరు అనుసరించడం వల్లె అది ముందుకు సాగుతుంది..
దేవుడున్న మాట నిజమే ఐతే "సుదర్శన్, రాజేశ్వరి"లను, మంత్రకాల్ల నెపంతో (సంగారెడ్డి దగ్గర) దుబ్బాక గ్రామంలో సజీవ దహనం చేస్తుంటె ఎందుకని వారిని రక్షించలేక పోయాడు ? వాల్లచే పూజించబడ్డ దేవుల్లు ఆ సమయంలో ఏం చేస్తున్నట్టు ?
ఒకవేెళ ఆ మంత్రగాళ్ల మంత్రాలకు శక్తి ఉండే మాటే నిజమైతే, ఆ దంపతులకు వచ్చు అనుకునే మంత్రాలు, వాల్లనెందుకు కాపాడలేక పోయాయి ?
హంతకులు వారిని కరెంట్ పోలుకు కట్టేసి, కిరోసిన్ పోసి కాల్చుతుంటె వారి కొచ్చిన ఆ మంత్రాలను చదివి, వారు తమను తామెందుకు కాపాడు కోలేక పోయారు ?
మంత్రాలకు ఏమాత్రం శక్తి ఉండదని ఈ సంఘటన వల్ల తెలిసిపోతుంది కదా !
ఒక వేళ దెయ్యాలే ఉంటే ఆ జంట చచ్చాక దెయ్యాలై తమని చంపిన వారిని పట్టవచ్చుకదా..?
ఇక పోలీసులెందుకు?
కేసులెందుకు?
ఈ భాదలెందుకు ?
మంత్రాల గురించి మరో మాట.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకులైన అబ్రహాం లింకన్, మహాత్మాగాంధీ, కెన్నెడీ, ఇందిరాగాంధీ ఇంకా రాజీవ్ గాంధీ, బెనజీర్ భుట్టో తదితరులంతా హత్యగావింప బడ్డవారే, వారిని చంపిన లేదా చంపించిన వారెవరూ మంత్రాలపై ఆధారపడకుండా, నేరుగా బాంబులనో తుపాకులనో ఆశ్రయించి వారిని పొట్టనబెట్టుకున్నారు..
మరి ఆ నాయకులపై మంత్రాలను ప్రయోగించి హంతకుల చేతికి మైల అంటకుండానే, వారిని ( ఆ నేతలను) సులభంగా అంతం చేయొచ్చు కదా !
ఒక దేశంమీద ఇంకో దేశం బాంబులేసి యుద్ధం చేయడమెందుకూ, శతృ దేశం మీద మంత్రాలు ప్రయోగించొచ్చుగదా, వారి సైనికులపై చేతబడి చేయొచ్చు కదా ! కాని ఎవరూ అలా చేయడం లేదు ఎందుకని ?
అలా జరుగడం లేదంటే మంత్రాలకు శక్తి ఉండదనేగా అర్థం !
దెయ్యం గూర్చి మరో చిన్న ప్రశ్న..
అందరూ, దెయ్యాలంటె తెల్ల చీర, మల్లె పూలు, కాల్లగజ్జెలు ఇంకా ఏవేవో ఊహిస్తారు కదా !
మరి కళ్ళు కనపడని గుడ్డివారికి దయ్యం ఏ రంగు చీరతో కనపడుతుంది ?
మీ కేమో దయ్యం రాత్రి మాత్రమే కనిపిస్తుంది, రాత్రైందంటే దెయ్యం భయంతో వణికి చస్తారు కదా ! మరి పుట్టు గుడ్డివాల్లకు దెయ్యం ఎప్పుడు కనిపిస్తుంది ? ఈ గుడ్డి వారు దయ్యానికి ఎప్పుడు భయపడుతరు ? రాత్రా, పగలా ?
భగత్ సింగ్ ని ఉరి తీసాక చనిపోయిన వెంటనె దయ్యమై బ్రిటీష్ వాల్లని పట్టలేదెందుకు ?
ఇప్పుడు టీవీ సిరియాల్లలో చనిపోయిన వాల్లు దయ్యాలై పడుతున్నారు కదా !
మరి పూర్వం యుద్దాల్లో చనిపోయిన వారు దయ్యాలై శతృ దేశ సైన్యాన్ని లేదా రాజుల్ని ఎందుకని పట్టలేదు ?
ఐనా దెయ్యాలెప్పుడూ తెల్ల చీరలే కడతయా ? లంగా జాకెట్టో, రంగు చీరలో లేదా చుడీదార్ ఫైజామా కుర్తానో లేకపోతే లేటెస్టుగా జీన్ ప్యాంటూ టీ షర్టు లో ఎందుకు ధరించవు, వాటికి డ్రెస్ కోడ్ పెట్టిందెవరు ?
అదీగాక అందరికీ ఆడ దెయ్యాలే ఎందుకు కనబడతున్నయ్, చచ్చిన మగవాల్లందరూ ఏమౌతున్నరు ? అసలు మగ దెయ్యాలుండవా ? లుంగీ, దోతీ లేదా ప్యాంటు వేసుకుని తిరిగే మగ దెయ్యం ఒక్కటి కూడా కనపడదు ఎందుకు ?
అమాయకత్వం కాకపోతె సచ్చినంక దయ్యమై పడుతరంటె ఎవరైనా ఎవరినైనా హత్యజేస్తరా ? కుట్రజేసి ఎవరినైనా చంపేస్తారా ?
ఇక దేవుల్ల సంగతి.. ఈ దేవుల్లు మన కష్టాలు కోరికలు తీర్చే మాట నిజమే ఐతే మరి రోజూ దేవుడి పక్కనే ఉండి పూజలు చేసె పూజారుల కష్టాలెందుకు తీర్చరు ?
పూజారులు, తాము కష్టాల్లో ఉన్నామని చెప్పి, దేవాదాయశాఖ మంత్రినో లేక ముఖ్యమంత్రినో కలిసి తమ డిమాండ్స్ నెరవేర్చమని వినతిపత్రాలు ఎందుకు ఇస్తున్నారు ? వారి మొర ఆ దేవునికి చెప్పుకుంటే లాభం లేదనేగా అర్థం !
తనని రోజూ పూజించే పూజారులకే దేవుడు ఎప్పుడూ ప్రసన్నంకాడు. పూజారులకు ప్రజల సొమ్ముతోనే జీతాలివ్వాల్సి వస్తుంటె ఇక ఆ దేవుడు ఎవరికి ఉపయోగ పడుతాడు ?
సంఘ వ్యతిరేక శక్తుల నుండి మనల్ని దేవుడే రక్షించి, దోషులను దేవుడే శిక్షించే మాటైతే, ఇంకా ఈ పోలీస్ వ్యవస్త ఎందుకు ? కోర్టులెందుకు, న్యాయ విచారణలెందుకు, తీర్పులెందుకు ?
దేవునికి ముడుపులు కట్టడం వల్ల లేదా ప్రార్థనలు చేయడం వల్ల రోగాలు నయమయ్యే మాటైతే.. ఇక ఈ హాస్పిటల్లెందుకు, మెడికల్ షాప్ లెందుకు, మందులెందుకు, అవి రాసిచ్చే డాక్టర్లెందుకు, వారిని తయారు చేసే మెడికల్ కాలేజీలెందుకు ?
ఇకనైనా ఈ అజ్జానం పోవాలి విజ్ఞానం, వికసించాలని కోరుతున్నాను..
చివరగా దేవుడూ దెయ్యం రెండూ అబద్దమేనని చెబుతున్నాను..
అలాగే మంత్రాలకు, పూజలకు, ప్రార్థనలకు ఎటువంటి శక్తులు ఉండవని కూడా తెలియ జేస్తున్నాను..
--- చెలిమెల రాజేశ్వర్, జేవీవీ, తెలంగాణ.
Comments
Post a Comment