మతం
మతం అంటే భగవంతుని నమ్మటమే.అదొక చట్రం.
మతం కొన్ని సత్యాలకు నీతికి విలువనిస్తుంది. కానీ అది మాయలతో మంత్రాలతో సంబంధం కలిగి ఉంది. అది భగవంతుని పై నమ్మకాన్ని విశ్వాసం ద్వారా పెంచుతుంది.
ఇందులో హేతువుకు తావులేదు. వ్యాపార రహస్యాలను నేర్చుకున్నట్లుగా మానవుడు మతాన్ని గురించి తెలుసుకోలేడు. తను చూసిన దాన్ని, విన్న వాటిని,చదివిన విషయాలను అనుభవంతో జోడించి ఆలోచించి అన్వేషించడం వల్ల మతాన్ని గురించి తెలుసుకోవాలి. అంతే తప్ప కేవలం విశ్వాసంతో కాదు.మాయలతో అద్భుతాలతో జ్యోతిష్యులతో కూడిన మతాన్ని మానవజాతిపై రుద్దడం అంటే వ్యాపారం చేయడమే.మతంహేతువాద భావాలను నిరోధిస్తోంది.విజ్ఞానం పెరిగేకొద్దీ
మతం సంకెళ్లు ఒక్కొక్కటి తెగి పడుతుంటాయి.
(సేకరణ: పిళ్లా కుమారస్వామి)
__థామస్ పేన్ (1737_1806
Comments
Post a Comment