సైన్సు విప్లవాలు : నాగరికత & సంస్కృతి

                   
సైన్సులో  విప్లవాలు : 

 "విప్లవం" అనగా సమాజం వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చేది. అది రక్తపాతంతోనా లేక రక్తపాత రహితంగానా  అనేది అనవసరం. మానవ నాగరికత (తద్వారా సంస్కృతి) లో మార్పులు తెచ్చేదే విప్లవం.  విప్లవాలు ముందుగా చెప్పిరావు. అవి వచ్చింతర్వాత  దాని  వినియోగాన్నిబట్టి మాత్రమే విప్లవాన్ని గుర్తించగలుగుతాం. సైన్సు విప్లవాల ఆవిష్కరణల్లో కూడా చాలా రక్తపాతం జరిగింది. ఎందరో శాస్త్రవేత్తలు ప్రాణాలు అర్పించారు. ఐనా నూతన సైన్సు ఆవిష్కరణలకు ప్రయత్నాలు నిరంతరం  కొనసాగుతూనే వుంటాయి.

 సమాజంలో  శాశ్వత మార్పుతోపాటు శాశ్వత వినియోగం లక్షణాలు కలిగివుంటుంది విప్లవం . ఆ విప్లవ  ఆవిష్కరణ వినియోగానికి "అంతం" అంటూ వుండదు.

సైన్సు విప్లవాలు : సైన్సులో కనుగొన్న ప్రతి చిన్న చితక  ఆవిష్కరణలను  విప్లవం అనకూడదు. ఆ ఆవిష్కరణ ఫలిత వినియోగం శాశ్వతంగా నిరంతరాయంగా కొనసాగుతూవుండాలి. అది మానవుడి జీవనవిధానాన్ని , నాగరికతను  మార్చేదిగా వుండాలి. అలాంటి వాటిలో ఇంతవరకు 6 ఆవిష్కరణలను మాత్రమే విప్లవాలుగా గుర్తించడం జరిగింది. అవి .....

    మొదటి విప్లవం     : "నిప్పు" కనుగొనడం ,
     రెండవ విప్లవం      : "చక్రం" కనుగొనడం
     మూడవ విప్లవం   : ఇనుము కనుగొనడం
     నాల్గవ విప్లవం      : నీటిఆవిరి కనుగొనడం
     ఐదవ విప్లవం        : ట్రాన్సిస్టర్  కనుగొనడం
     ఆరవ విప్లవం        : కంప్యూటర్ కనుగొనడం 
     ఏడవ విప్లవం        :  ???(ఎదురు చూస్తున్నాం)

1.  పాతరాతి యుగంలో  "నిప్పు"  : 
                ( క్రీ.పూ.6000 ముందు )

రెండు ఘనపదార్ధాలమధ్య ఘర్షణ ద్వారా ఉష్ణం ఉత్పత్తి చెంది , అది మండుతుంది. అక్కడ నిప్పు ఉత్పత్తి ఔతుంది. అనాదిగా కనుగొనబడి , సృష్టించబడిన "నిప్పు" వినియోగం నిరంతరాయంగా కొనసాగుతూనే వుంది. మానవుడి ఆహారపదార్థాల ఉత్పత్తిలో నిప్పు పాత్ర లేకుండా ఊహించలేము. అందుచేతనే నిప్పు ఆవిష్కరణను సైన్సులో మొదటి విప్లవంగా గుర్తించబడింది. క్రీ.పూ. 6000 సంవత్సరాలకు ముందున్న "పాతరాతి యుగం" లోనే  నిప్పు కనుగొనబడింది. రెండు ఎండు కర్రలు/చెక్కలను ఎంతో బాగా ఒరిపిడి చేసి శ్రమించి రుద్దితే, ఆ ఘర్షణనుంచి నిప్పు పుడుతుంది. దాన్ని "అరణి" లో నిప్పు పుట్టించడం అనేవారు.  అడవులు, అరణ్యాలలో మంటలురావడం చూసి మనిషి నిప్పు  తయారు చెయ్యడం నేర్చుకున్నాడు. ఎంతో శ్రమతో ఉత్పత్తి అయ్యేది కనుకనే తాము సృష్టించిన "అగ్నిహోత్రం" ఆరిపోకుండా చూసుకునేవారు. నేడు అగ్గిపెట్టెలు , లైటర్లు రావడంతో మనకు "నిత్య అగ్నిహోత్రం"తో పనిలేదు. 

# నాగరికత & సంస్కృతి : 

i) "అరణి" తో కష్టపడి నిప్పు పుట్టించిన మానవుడు , నేడు అగ్నిపెట్టె/గ్యాస్ లైటర్" తో తేలిగ్గా నిప్పు పుట్టిస్తున్నాడు. గ్యాస్ లైటర్లు వినియోగించేవారు నాగరికులుగా మారిపోగా , ఇంకా "అరణి" తోనే అగ్నిపుట్టించేవాడు అనాగరికుడుగా పిలువబడ్డాడు. 
మెజారిటీ ప్రజలందరూ అగ్గిపెట్టెలు/గ్యాస్ లైటర్ వినియోగించడం మొదలుపెట్టడంతో అది వారి సంస్కృతి గా మారిపోయింది.

ii) పచ్చిమాసం తిన్న మానవులు కాల్చుకుతినడం నేర్చుకున్నారు. అది వారిని "నాగరికత" నేర్చిన నాగరికులుగా మార్చింది. పచ్చి మాంసం తినేవారు అనాగరికులుగా మిగిలిపోతారు. అందరూ కాల్చుకు తినడం అమలుచేయడంతో అలా కాల్చుకుతినడం వారి "సంస్కృతి"గా మారింది. 

అనగా కొద్ది మందితో ప్రారంభమైన నాగరికత, అందరూ/మెజారిటీ అలవరచుకోడంతో అది వారి సంస్కృతి గా మారుతుంది. సైన్సులో నూతన ఆవిష్కరణలతో కొత్త కొత్త నాగరికతలు వస్తూవుంటాయి. కొంతకాలానికి ఆ నాగరికతలు సంస్కృతిగా మార్పుచెందుతూ వుంటుంది. కావున "నాగరికత & సంస్కృతి" శాశ్వతాలు కావు. 

**  అంతేగాని మన ఆర్యబ్రాహ్మణులు చెప్పే యజ్ఞాలు, యాగాలు,పూజలు,  పురాణాలు , దేవుళ్ళు , పౌరోహిత్యాలు , చావులు , వివాహవేడుక విధానాలు, ..... ఇలాంటి అమాంబాపతు విధానాలు మన "సంస్కృతి కాదు". మెజారిటీ ప్రజల జీవన విధానమే ఆ "దేశ సంస్కృతి". అది చలనస్వభావమే గాని జడత్వ (శాశ్వత) స్వభావం కలిగివుండదు. 

2.  కొత్తరాతి యుగంలో "చక్రం"  :
         (  క్రీ.పూ6000 - 4000వరకు)

గుండ్రటి వృత్తాకారంలో తయారుచేయబడిన "చక్రం" గమనం (రవాణా)కు ఎక్కువ సహాయకారిగా ఉండటాన్ని గుర్తించడం జరిగింది. చక్రం తయారీలో ఎన్నో మార్పులు వచ్చినా , ఉపయోగం ఒకటే. నేడు రెండు చక్రాల బండి దగ్గరనుంచి రోదసీలోకి ప్రయాణిస్తున్న రాకెట్లు (వ్యోమనౌకలు) వరకూ చక్రం లేకుండా తయారవ్వడం ఊహించలేని విషయం. అందుకనే చక్రం ఆవిష్కరణ "కొత్తరాతి యుగం"   (క్రీ.పూ. 6000 - 4000 వరకు) లో  కనుగొనబడిన రెండవ సైన్సు ఆవిష్కరణగా  గుర్తించడం జరిగింది. నిప్పుతో మట్టి ఇటుకలు కాల్చి ఆ ఇటుకలను తయారు చేసి మైదానప్రాంతాల్లో నివసించడం "నాగరికత" గా మారింది. ఆ కాల్చిన ఇటుకలు వినియోగించిన కాలం "కొత్తరాతి యుగం" గా పిలువబడింది. చీకటి గుహల్లో నివసించిన మానవులు మైదానప్రాంతాల్లోకి , నదీతీరప్రాంతాల్లోకి వచ్చి నివసించడం ప్రారంభించడంతో వారి "నాగరికత" పురోగామి దిశలో మార్పుచెందింది. 
ఇంకా కొండగుహల్లోనే నివశించేవాడు అనాగరికుడుగానూ , మైదానప్రాంతాల్లో నివశించేవాడు నాగరికుడుగానూ అవతరించారు. 
మెజారిటీ కొండగుహలు మైదానప్రాంతాల్లో నివశించడం ప్రారంభించడం వారి "నూతన సంస్కృతి" గా మారిపోయింది. 

3.  లోహయుగంలో  "ఇనుము"  : 
          ( క్రీ.పూ.4000 - 2000వరకు. 
             వినియోగంలోకి వచ్చింది క్రీ.పూ.750నుంచి)

లోహయుగంలో మొదట రాగియుగం (క్రీ.పూ.4000 - 3500 వరకు), కంచుయుగం (క్రీ.పూ.3500 - 3000 వరకు) తర్వాత ఇనుప యుగం (క్రీ.పూ. 3000 - 2000 వరకు) ప్రారంభమైంది. 

రాగి మెత్తగా వుండటంచేత,కంచు పెళుసుగా వుండటంచేత అవి వ్యవసాయ పరికరాలకు ఉపయోగపడలేదు. కానీ ఇనుము బలిష్టంగానూ పదునుగానూ , వంగకుండానూ ఉండే లక్షణాలు కలిగి ఉండటంతో  వ్యవసాయ పరికరాలు, పనిముట్లు తయారుకు ఎంతో ఉపయోగపడింది. ఇది ఆహార ఉత్పత్తి దశలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. ఈనాటికీ ధృడంగా ఉండాల్సిన ఏ వస్తువైనా ఇనుము/స్టీల్ తోనే తయారు చేయబడుతున్నాయి. ప్రజలు ఎముకలతో , కర్రలతో తమ ఆయుధాలు తయారు చేసుకోడం మానేసి , ఇనుప వస్తువాహనాలు తయారు చేసి వాడకంలోకి తెచ్చుకోవడం తో నవీన నాగరితకు మార్పు చెందారు. క్రమేణా అదే వారి "నూతన సంస్కృతి"గా మారిపోయింది. 
   అందుకే ఇనుము ఆవిష్కరణ సైన్సులో 3వ విప్లవంగా పిలువబడుతున్నది. 

4.  నవీన ( చరిత్ర) యుగంలో "నీటియావిరి"  : 
      ( క్రీ.శ. 1600 నుంచి; కనుగొనబడింది 1685లో )

మన ప్రపంచ చరిత్రను 
 క్రీ.పూ.2000 - క్రీ.శ.1000వరకు ప్రాచీన(చరిత్ర) యుగం గానూ, 
క్రీ.శ.1000 - 1600 వరకు మధ్య(చరిత్ర)యుగం గానూ
క్రీ.శ.1600 నుంచి ఆధునిక(చరిత్ర) యుగం గానూ 
పిలుస్తున్నారు. 

నేటి క్రీ.శ.1685లో నీటియావిరి ని కనుగొనడం జరిగింది. ఆవిరియంత్రాలు , రైలు యంత్రాలు, మొదలగు అనేక ఇనుప యంత్రాలు నీటియావిరి తో నడపబడటంతో పారిశ్రామిక విప్లవం  పుంజుకుంది.
నీటియావిరిని తయారుచేసే "బాయిలర్" లేని ఫ్యాక్టరీని ఊహించలేము. అతిపెద్ద ఉక్కు ఫ్యాక్టరీలు నడపడానికి కూడా బాయిలర్లలో నీటియావిరి తయారుచేయవలసిందే.
అంచేతనే నీటియావిరి ఆవిష్కరణను సైన్సులో 4వ విప్లవంగా గుర్తించబడటం జరిగింది. 

5. నవీన యుగంలో  "ట్రాన్సిస్టర్" : క్రీ.శ.1948లో

రెండవ ప్రపంచయుద్ధం కాలంలో పాల్గొన్న అన్ని దేశాలవారూ సమాచారం రవాణాకు టెలిగ్రాం లైన్లు , రేడియోల ద్వారా వార్తల ప్రసారానికి ఆధారపడ్డారు. యుద్ధ సమయంలో టెలిగ్రాం/టెలిఫోన్ లైన్లు వేయడం చాలా కష్టసాధ్యమైన పని. రేడియోలు కూడా పెద్దసైజులో , పెద్దసైజు  "వాల్వు"లతో వుండి , విద్యుత్ఛక్తి పై ఆధారపడి  జేబులో తీసికెళ్ళడానికి వీలుగా Portable గా వుండేవి కాదు. అలాంటి సమయంలో "అతి చిన్నసైజు"లో వుండి , తక్కువసైజు వుండే ,జేబులో పెట్టుకొని వెళ్ళగలిగి , చిన్ని బ్యాటరీ సెల్ మీద పనిచేయగల రేడియో ను తయారు చేయడానికి ఉపయోగపడింది అతిచిన్న సైజువుండే "ట్రాన్సిస్టర్" ఆవిష్కరణ. రేడియో ట్రాన్స్మిటర్లు , వాకీటాకీలు వినియోగంలోకి వచ్చాయి. టెలిఫోన్, రేడియోలు అవసరం లేకుండా కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది ట్రాన్సిస్టర్. అందుకే ట్రాన్సిస్టర్ ఆవిష్కరణ ను సైన్సులో 5వ విప్లవంగా పేర్కొన్నారు. ఇప్పుడు ఎవరూ టెలిగ్రాం , రేడియోల జోలికి పోవడంలేదు. వాటి వినియోగంలోకి పోతే వాడు ఖచ్చితంగా "అనాగరికుడు". 

6. నవీన యుగంలో "కంప్యూటర్" : 
            ( క్రీ.శ 1949 నుంచి 1975 వరకు )

నవీన యుగంలో కంప్యూటర్ ఆవిష్కరణ. సైన్సులో 6వ విప్లవంగా పేరుపొందింది. ఐతే ఇది ఒక్కసారిగా ఆవిష్కరింపబడింది కాదు. 1949-55 మధ్య Vaccume Tube, 1956- 65 మధ్య ట్రాన్సిస్టర్ (చిన్న సైజు పోకెట్ రేడియో), 1966-75 మధ్య Integrated Circuits , 1975 లో Microprocessor కనుగొనటంతో వాటి అరమరికలతో "కంప్యూటర్" తయారయింది. ఎవరూ ఊహించని వినయోగాలు నేడు చూస్తున్నాము. టీవీ ప్రసారాలు, సెల్ ఫోన్ లు , టచ్ స్క్రీన్లు‌ , ప్లీడర్లు , హోటళ్ళు , విమానాశ్రయాలు , లైబ్రరీలు, ..... ఎన్నని,ఎన్నని  చెప్పగలం ? ఇంకా ఎన్నిరకాల వినియోగాలు అందుబాటులోకి వస్తాయో తెలియదు, ఊహించలేము. 
      ఇప్పుడు మనం సైన్సులో 6వ విప్లవమైన "కంప్యూటర్ విప్లవం"లో ఈదులాడుతున్నాం. 

7. నవీన యుగంలో 7వ సైన్సు విప్లవం : 
          ( స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉందాం )

ప్రపంచ శాస్త్రవేత్తలు ఇప్పుడు సైన్సులో 7వ విప్లవం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ త్వరలోనే రావచ్చు. ఎప్పుడు వచ్చినా మనం స్వాగతం చెప్పాల్సిందే. 

"మేము స్వాగతం చెప్పం" అని ఛాందస వైదీకుల్లాగా మనం మంకుపట్టు పట్టినా ఉపయోగం లేదు. పైకి ఎన్ని చెప్పినా , వచ్చిన ప్రతి సైన్సు విప్లవాన్ని మొదట ఉపయోగించుకుందీ, లబ్ధిపొందిందీ వైదీక మహాశయులే.

■ నా అంచనా : 

     తదుపరి 7వ సైన్సు విప్లవం : 

        సూపర్ కండక్టివిటీ SUPER CONDUCTIVITY 

షుమారు ౼15℃వద్ద అధమవాహకాలు >>>> "ఉత్తమ వాహకాలు"గా స్వభావాన్ని మార్చుకొనుట. 

ఉదా : మామూలు మన గది ఉష్ణోగ్రత వద్ద
          "ఇసుక బిళ్ళ"  ఉత్తమ " అధమ" వాహకం. దానినుండి ఉష్ణము/విద్యుత్తు ప్రవహించదు. 
             కానీ అదే "ఇసుక బిళ్ళ" ౼15℃ వద్ద "ఉత్తమ"వాహకం స్వభావాన్ని ప్రదర్శిస్తుంది .
( ఇది నేను స్వయంగా చూశాను.)

కొన్ని ముఖ్య ఉపయోగాలు :

i)  ఇంటిపైన నీటిని overhead ట్యాంకుల్లో నీరు నిల్వచేసుకున్న విధంగా, విద్యుత్తును నిల్వ చేసుకొనవచ్చును. కరెంటు కొరతవుండదు. 24గంటలూ పరిశ్రమలు నడుపుకొనవచ్చును. 

ii) రైలుపట్టాలకు 2 అంగుళముల పైన గాలిలో పరిగెత్తే, విమానంకంటే వేగవంతమైన "బుల్లెట్ ట్రైన్" నడపవచ్చును. 

...... ఇంకా అనేకమైన మనం ఊహించలేని ఉపయోగాలు వినియోగంలోకి రావచ్చును. 

అంతిమంగా : 

 నాగరికత & సంస్కృతి : 

సైన్సు ఆవిష్కరణల వినియోగం ద్వారానే సమాజం "నాగరికత" పెంచుకుంటుంది. 

 ఎక్కువమంది నాగరికత నేర్చుకొని వినియోగించడం మొదలుపెడితే , అది ఆ సమాజం "సంస్కృతి" అంటారు. సంస్కృతి స్థిరంగా ఉండే జడపదార్ధం కాదు. 

 
-- ఆకురాతి మురళీ కృష్ణ,
   రచయిత : సమతాశాస్త్రం
    093913 25046.

                        ◆◆◆◆◆

Comments

Popular posts from this blog

Darwin theory

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం